A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
Share |
July 18 2019, 8:01 am

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించవచ్చా అని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి వాటిని ప్రోత్సహించారని ఆయన అన్నారు. రెండో రోజు ఎస్పిలు,కలెక్టర్ ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజావేదిక భవనానికి చట్టపరమైన అనుమతులు లేవు. నదీ పరిరక్షణ చట్టానికి తూట్లు పొడిచి నిర్మించారు. ఈ భవనం పక్కనే మాజీ సీఎం చంద్రబాబు ఉంటున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించారు. సుపరిపాలన అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. సుపరిపాలన అంటే అక్రమ కట్టడాలలో నివసించడమా? అని ఆయన అన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఈ భవనంతోనే ప్రారంభమవుతుంది. ప్రజావేదిక నుంచి మొదలు పెట్టి ఈ రోడ్డంతా క్లీన్‌ చేస్తాం. రోడ్డు వెంట ఉన్న ఆక్రమణలన్నీ తొలగిస్తామని ఆయన అన్నారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info