A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
Share |
October 22 2019, 1:36 am

;ప్రజావేదిక భవనం కూల్చివేయాలన్న నిర్ణయంపై టిడిపి నేతలు కొందరు అడ్డగోలుగా మాట్లాడుతుంటే విజయవాడ ఎమ్.పి కేశినేని నాని మాత్రం పద్దతిగా మాట్లాడినట్లుగా ఉంది. ఆయన ట్విటర్ లో ఒక వ్యాఖ్య చేవారు.
ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే... అది ప్రజాధనంతో నిర్మించిన వేదిక. ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్నీ తొలగించిన తర్వాతే.. ప్రజావేదికను చివర్లో తొలగిస్తే బాగుంటుందన్నది తన అబిప్రాయమని ఆయన అన్నారు. ఇప్పుడు తొలగిస్తే రాష్ట్ర ఖజానాకు రెండు విధాలుగా నష్టం. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేస్తే సొమ్ము వృథా అవుతుంది. మరో వేదిక కట్టే వరకు ప్రభుత్వ సమావేశాలు నిర్వహించుకోవాలంటే ప్రైవేటు వేదికలకు డబ్బు ఖర్చవుతుంది. ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి, ఈలోపు కొత్త సమావేశ వేదిక నిర్మించి, అప్పుడు ప్రజావేదిక తొలగిస్తే బాగుంటుందని ఆయన సూచించారు.

tags : kesineni

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info