A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
Share |
October 22 2019, 2:24 am

ముఖ్యమంత్రి జగన్ రచ్చబండ పేరుతో జనంలోకి వెళ్లాలని,వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారాలు చూపాలని భావిస్తున్నారు. కలెక్టర్ ల కాన్పరెన్స్ లో ఆయన ఈ విషయం వెల్లడించారు.అయితే కొన్ని మీడియా సంస్థలు గతంలో వైఎస్ చేపట్టిన రచ్చబండతో పోల్చుతూ విశ్లేషణలు ఇచ్చాయి. 2009లో జగన్ తండ్రి,ఆనాటి ముఖ్యమంత్రికి బొటాబొటి ఆదిక్యత ఇచ్చారని దానితో ఆయన రచ్చబండ కార్యకర్యక్రం చేపట్టారని, కాని ఇప్పుడు జగన్ కు అసాదారణమైన మెజార్టీ ఇచ్చారని,అయినా 2024లో రాబోయే రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఒక టిడిపి మీడియా వ్యాఖ్యానించడం విశేషం. వైసీపీని బలోపేతం చేయాలంటే ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ యోచిస్తున్నట్లు అధికారపక్షం నేతలు చెబుతున్నారని ఆ కధనంలో పేర్కొన్నారు. తన పాలనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటూనే వాటికనుగుణంగా కార్యక్రమాల రూపకల్పన, పథకాల అమలుకు చర్యలు చేపట్టాలని జగన్‌ భావిస్తున్నారని రాశారు.

tags : jagan,racchabanda

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info