A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
Share |
October 22 2019, 2:46 am

తెలంగాణ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ను ముఖ్యమంత్రి కెసిఆర్ బ్రహ్మాండమైన రీతిలో ఆరంబించారు. గవర్నర్ నరసింహన్ ను, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ ,ఫడ్నవీస్ లను ఆహ్వానించి,కొన్ని గంటల పాటు ఆయన వారిని వెంటపెబ్టుకుని మరీ కార్యక్రమాలను నిర్వహించారు.కాళేశ్వరం ప్రాజెక్టు కు ఎనబైవేల కోట్ల అంచనాతో చేపట్టారు. మరి కొన్ని అదనపు లిప్ట్ లతో అది లక్ష కోట్లకు చేరవచ్చు. బహుశా బారత దేశంలోనే ఇంత భారీ ఎత్తున ఖర్చు చేసి ప్రాజెక్టును నిర్మించి ఉండకపోవచ్చు. అదే సమయంలో ప్రపంచంలోనే ఇంత ఎత్తులో లిప్ట్ ఏర్పాటు చేసిన చరిత్ర కూడా ఇదే నంటున్నారు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టారు.అందులో కొన్ని మార్పులు చేసి కాళేశ్వరం కింద కెసిఆర్ డిజైన్ చేసి ప్రాజెక్టును అమలు చేశారు. దీనివల్ల నలభై ఐదు లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, అలాగే హైదరాబాద్ కు, పారిశ్రామిక అవసరాలకు నీటి సదుపాయం వస్తుందని భావిస్తున్నారు. రికార్డు స్థాయిలో దీనిని నిర్మాణం చేసినందుకు మేఘ ఇంజనీరింగ్ సంస్థను, చేయించిన కెసిఆర్ ను అబినందించవలసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ పొలాలు సస్యశ్యామలం అయితే అంతా సంతోషిస్తారు.అందులో ఎక్కడా అనుమానం లేదు. అయితే ఇంత భారీ ఖర్చును ప్రభుత్వం భరించగలుగుతుందా?అన్న చర్చ ఉంది.ఎకరాకు నలభై వేల రూపాయల వరకు అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం బాగా అందుబాటులోకి రావడం వల్ల కెసిఆర్ ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకు వెళ్లింది. అయితే సాదారణంగా ఏ ప్రాజెక్టులో అయినా కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తారు. కాని ఇక్కడ అలా చూడడం కుదరకపోవచ్చు. ఎందుకంటే జనావళికి ప్రాణ సమానమైన నీటిని అందించడం కనుక. తెలంగాణ ప్రభుత్వం ఆర్దికంగా బ్రహ్మాండంగా ఉండి ఉంటే ఈ వ్యయం బరించడం పెద్ద ఇబ్బంది కాదు. అలా కాకపోతే,అప్పులు బాగా పెరిగిపోతే కొంత ప్రమాదకర పరిస్థితి రావచ్చు.వీటన్నిటిని ముఖ్యమంత్రి కెసిఆర్ గమనించే ముందుకు వెళుతున్నారని అనుకోవాలి.కాగా ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ లో భిన్న స్వరాలు వస్తున్నాయి.మల్లు భట్టి వంటి కొద్ది మంది ప్రాజెక్టులో అవినీతి అని, ఆర్దిక భారం అని ,మరొకటిని విమర్శిస్తున్నారు. నీరు వస్తే సంతోషిస్తామని, కెసిఆర్ ను సన్మానిస్తామని జగ్గారెడ్డి వంటి వారు అంటున్నారు.అయితే ఎపి సి.ఎమ్. జగన్ ను ఆహ్వానించడాన్ని, ఆయన రావడాన్ని వివాదం చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు, మరికొందరు టిడిపి నేతలు ప్రయత్నిస్తున్నారు .గతంలో జగన్ అలా అన్నారు..ఇలా అన్నారు..అంటూ రాగాలు తీస్తున్నారు.మరి అదే సమయంలో తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టుల గురించి ఏమన్నారో తెలుసుకోవాలి.ఆ తర్వాత ఎపి ప్రబుత్వ పరంగా ఎలా విమర్శించారో తెలుసుకోవాలి.నిజంగానే ఎపికి నష్టం జరుగుతుంటే అది వేరే విషయం .కాని ఎపికి ప్రధానంగా శబరి నుంచి వచ్చి గోదావరిలో కలిసే అందుబాటులోకి వస్తుంది.అందువల్ల కాళేశ్వరం వల్ల ఎలాంటి నష్టం ఉండదు.అయినా టిడిపి కూడా ఏదైనా రాద్దాంతం చేయాలని చూస్తోంది.టిఆర్ఎస్ తో పొత్తు కోసం అర్రులు చాచి, అది కుదరకపోవడంతో అదే టిఆర్ఎస్ ను,కెసిఆర్ ను నానామాటలు అని భంగపడ్డ టిడిపి మాటలకు ఇప్పుడు విలువ లేదు.రెండు రాష్ట్రాల సి.ఎమ్ లు సృహృద్బావ వాతావరణంలో ముందుకు వెళుతుంటే హర్షించాల్సింది పోయి ఏదో రకంగా తంపులు పెట్టాలని టిడిపి చూస్తోంది.అవేమీ ఇప్పట్లో ఆ పార్టీకి లాభం చేకూర్చవు. కాగా ప్రాజెక్టు ఎంతవరకు ఉపయోగపడుతుందన్నదానిపై కూడా టిడిపి అనవసర వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది.అయితే జగన్ గతంలో ప్రతిపక్షంల ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టును నిజంగానే వ్యతిరేకించి ఉంటే,దానిపై వివరణ ఇస్తే మంచిదే. ఇక తెలంగాణలో మాజీ మంత్రి ,అప్పట్లో ఈ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి కృషి చేసిన హరీ్ష్ రావు కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై కూడా రాజకీయంగా వ్యాఖ్యలు వస్తున్నాయి. అలాగే టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ వెళ్లకపోవడం కూడా గమనించదగ్గ విషయమే.మరి కెసిఆర్ కు హరీష్ కు ఎందుకు గాప్ పెరిగిందో కాని,దాని ప్రభావం పార్టీపై పడుతోందని అంటున్నారు. ఏది ఏమైనా కెసిఆర్ కు ఇవన్ని తెలియనివి కావు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆరంబించిన కెసిఆర్ కు శుభాకాంక్షలు చెబుదాం.

tags : kaleswaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info