A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
Share |
November 18 2019, 11:24 am

ఎపి ప్రభుత్వం చేపట్టిన గ్రామవలంటీర్ల పదకం వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకే ఉపయోగపడే అవకాశం ఉందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల మీ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు, రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారు,ప్రభుత్వ సలహాదారు శ్రీ అజయ్ కలాం గారు , పార్టీ బూతు స్ధాయి నాయకుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామ-వార్డు వాలంటీర్లు నియమాకాలలో పార్టీ కార్యకర్తలకు న్యాయం చేస్తామని, వారికే ప్రాధాన్యతను ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ సమావేశంలో మాట్లాడిన మాటలు సాక్షి దిన పత్రిక, సాక్షి టీవి ఛానల్ తో పాటు అన్ని వార్తా మాధ్యమాలలో ప్రముఖంగా వచ్చింది. ఈ వార్తలను, గ్రామ-వార్డు వాలంటీర్ల నియమాకాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను పరిశిలిస్తే కేవలం మీ పార్టీకి
చెందిన కార్యకర్తలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూపొందించపడిన పధకంగా స్ఫష్టం అవుతోంది.

గ్రామ-వార్డు వాలంటీర్ల నియమాకాల ప్రక్రియపై రాష్ట్రంలోని అన్ని విద్యార్ధి, యువజన సంఘాల ప్రతినిధులతో, అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సూచనలను, సలహాలను పరిగణలోకి తీసుకుని, ఈ కార్యక్రమాన్ని పారదర్శకతతో, అవినీతి రహితంగా చేపట్టాలని కోరుతున్నాం.

గ్రామ-వార్డు వాలంటీర్ల నియమాకాలు పారదర్శకతతో, మెరిట్ ప్రాతిపాదికతతో నియమాకాలు
చేపట్టని పక్షంలో మీరు ఉన్నత ఆశయంతో చేపట్టిన ఈ ప్రక్రియ విఫలం అవ్వడంతో పాటు ప్రభుత్వం
అప్రదిష్టపాలవుతుంది.

గ్రామ-వార్డు వాలంటీర్ల నియమాకాల ప్రక్రియపై వెంటనే మీరు ప్రభుత్వం తరపున ఈ చర్యలను
చేపట్టాలని కోరుతున్నాం.

(1) గ్రామ-వార్డు వాలంటీర్ల నియమాకాల్లో మార్కుల ఆధారంగా, మెరిట్ ప్రాతిపాదికన
నియమకాలు చేపట్టాలి.
(2) అదనపు విద్య అర్హతకు అదనపు వెయిటేజ్ కల్పించాలి
(3) ఇంటర్వూ బోర్డ్ కు కేవలం మార్కుల సర్టిఫెకెట్ లు, కులధృవీకరణ పత్రం తదితర
అంశాలను మాత్రమే పరిశిలించే బాధ్యతను అప్పచెప్పాలితప్ప నియమాకాల్లో బోర్డు కు
ఎటువంటి అధికారాన్నికల్పించకూడదు.
(4) గ్రామ-వార్డు వాలంటీర్లు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను, ఎంపికైన వారి
వివరాలను గ్రామ పంచాయతీ, ,వార్డుల కార్యాలయాల వద్ధ ప్రజలకు అందుబాటులో
ఉంచాలి.
(5) రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను సదరు నియమాకాల్లో ఖచ్చితంగా అమలు చెయ్యలి
పై అంశాలను మీరు పరిగణలోకి తీసుకుని గ్రామ-వార్డు వాలంటీర్ల నియమాకాల్లో ఎటువంటి
అవకతవకలు చోటుచేసుకోకుండా వెంటనే తగు చర్యలను తీసుకోవాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరపున
విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో నిరుద్యోగ యువతి యువకులకు న్యాయం జరిగేందుకు ఉత్తరాంధ్ర చర్చా
వేదిక తరపున న్యాయస్ధానాన్ని ఆశ్రయించి పోరాటం చేయడాన్కి వెనుకాడబోమని మీకు
తెలియచేస్తున్నాం
అభినందనలతో.....
ఇట్లు
( కొణతాల రామకృష్ణ)
మాజీ మంత్రి,
కన్వీనర్, ఉత్తరాంధ్ర చర్చా వేదిక

tags : konatala

Latest News
*ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా రోజా కార్యక్రమం
*ఆంగ్ల మాద్యమం -ప్రముఖ నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
*చింతమనేనికి అబ్బయ్య చౌదరి సవాల్
*అమరావతి ..చంద్రబాబు శోకాలు ఎందుకంటే
*కేంద్ర బడ్జెట్ లో 2 లక్షల కోట్ల కోత!
*పార్లమెంటులో మరీ రెండు నిమిసాలా- గల్లా
*అమ్మెస్టీ సంస్థలో36 కోట్ల అక్రమ డబ్బా!
*గాంధీజి ఇసుక విగ్రహం అద్బుతం
*మంత్రి మద్యం మత్తులో మాట్లాడారా
*జూనియర్ ఎన్టి.ఆర్.అక్కర్లేదు- టిడిపి ప్రకటన
*డిసెంబర్ 20 లోగా ఎపిలో లబ్దిదారుల జాబితాలు
*పవన్ అలా..ఆర్.నారాయణమూర్తి ఇలా
*రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
*కెసిఆర్ కు సునీల్ శర్మ వకల్తానా
*వార్తా విలేకరుల అవినీతితో చావొచ్చింది
*పోలవరానికి ప్రతిపక్షం అడ్డంకులు
*కాళేశ్వరం జాతీయ హోదా-కిషన్ రెడ్డి క్లారిటీ
*పత్రికలు-రాజకీయ పార్టీలు- వెంకయ్య స్పీచ్
*బిజెపికి దొరికిన ఖరీదైన చేప
*జూన్ నాటికి సీతారామ ప్రాజెక్టు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info