A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
Share |
October 22 2019, 2:48 am

ఇకపై గాందీ భవన్ లో ప్రెస్ మీట్ లు పెట్టాలంటే పిసిసి అద్యక్షుడి అనుమతి అవసరమని నిర్ణయించారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు.కొంతమంది గాందీ భవన్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేపద్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉంది. కాగా
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిని మార్చడం అనవసరమని జగ్గారెడ్డి అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలని కుంతియాకు చెప్పినట్టు తెలిపారు. ప్రాంతీయ పార్టీల్లో లాగా కాంగ్రెస్‌లో సింగిల్ హీరో ఉండరని, బలమైన నాయకులు చాలా మంది ఉన్నారని అన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ వీడినా పార్టీ బలంగానే ఉందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా సహకరిస్తానని, అవకాశం ఉంటే తనకు ఇవ్వాలని కుంతియాను కోరినట్టు తెలిపారు.

tags : jaggareddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info