A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రిని మందలించిన జగన్
Share |
July 18 2019, 8:06 am

మంత్రి అవంతి శ్రీనివాస్ ను ముఖ్యమంత్రి జగన్ మందలించిన తీరు ఆసక్తికరంగా ఉంది.జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ ఘటన జరిగింది.మీడియాలో వచ్చిన కదనం ప్రకారం వైఎస్సార్‌ అభయహస్తంపై చర్చ వచ్చినప్పుడు మంత్రి అవంతి శ్రీనివాస్‌ అధికారులను తప్పుబట్టేలా మాట్లాడటంతో ముఖ్యమంత్రి సున్నితంగా మందలించారట. ‘శ్రీనూ.. అధికారులు, మనం వేర్వేరు కాదు. మనం టీంగా పనిచేయాలి. మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం. ప్రతిపక్షంలో లేమన్నది గుర్తుంచుకోవాలి’ అని సలహా ఇచ్చారు.

ఐదేళ్లలో రాష్ట్రంలోని రైతాంగం నుంచి 13 ప్రభుత్వ, ప్రైవేటు బీమా కంపెనీలు రూ.40 వేల కోట్లు ప్రీమియం రూపంలో వసూలు చేశాయని, వాటికి రూ.15 వేల కోట్ల లాభం వచ్చిందని జగన్‌ తెలిపారు. దానికి తగ్గట్టు బీమా కంపెనీలు సేవలందించలేదని వివరించారు. అందుకే రైతులందరికీ బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.

tags : jagan,minister

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info