A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
Share |
July 18 2019, 8:36 am

తెలుగుదేశం హయాంలో వేసిన పోలవరం ప్రాజెక్టు అంచనాను కేంద్రం ఆమోదించిందని మాజీ మంత్రి లోకేష్ అన్నారు.పోలవరంలో ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పాలని ఆయన ట్విటర్ లో డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం పంపిన అంచనాలకే కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. అదీగాక ఎప్పుడో ఆమోదించిన విషయాన్ని మా గొప్పతనం అని వైసీపీ డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమన్నారు. అవినీతికి తావు లేకుండా కేవలం ప్రజల కోసం అహర్నిశలు చంద్రబాబు పడ్డ కష్టానికి ఫలితమే పోలవరం ప్రాజెక్ట్ అని ఆయన అన్నారు. ఇప్పటికైనా బీజేపీ, వైసీపీ నాయకులు తెలుగుదేశం మీద బురదజల్లడం మానుకోవాలని, మిగిలిన 30శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయటంపై దృష్టి పెట్టాలని ఆయన అ్నారు.

tags : lokesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info