A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒకే దేశం- ఒకే ఎన్నిక- జగన్ మద్దతు
Share |
October 16 2019, 8:47 pm

ఒకే దేశం.. ఒకే ఎన్నికపై ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన స్పష్టమైన అబిప్రాయం చెప్పారు.అది మంచి ప్రతిపాదన అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ప్రతిపాదన ఒక సాహసోపేతమైన చొరవ. మా రాష్ట్రంలో పార్లమెంట్‌కు, రాష్ట్ర శాసనసభకు 1999 నుంచి ఒకేసారి జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలో మేం 20 ఏళ్లుగా భాగస్వాములం. ఒకే దేశం–ఒకే ఎన్నిక సూత్రాన్ని ప్రాథమికంగా చూస్తే ఎన్నికల వ్యయం తగ్గుతుంది. ఐదేళ్లకు ఒకేసారి ఎన్నిక జరగడం వల్ల ఈ ప్రక్రియ ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచుతుంది. పాలనలో అంతరాయం తగ్గుతుంది. పైగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వేరే కాలపరిమితితో ఉన్నప్పుడు ఆ సమయంలో వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో స్వప్రయోజనాల కోసం ఆ రకంగా స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల ప్రక్రియకు విఘాతం ఏర్పడుతుంది. అలాగే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే అధికారంలో ఉన్న పార్టీకి ఆ రాష్ట్రంలోని అధికారులు, పోలీసు యంత్రాంగంపై నియంత్రణ ఉండేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల నేను ఒకే దేశం–ఒకే ఎన్నిక ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నా. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల కోసం, విస్తృత భాగస్వామ్యం కలిగిన ప్రజాస్వామ్యం కోసం మద్దతు ఇస్తున్నా. అయితే వివిధ రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి విభిన్న సమయాల్లో ఉంది. ప్రధానమంత్రి ఈ ప్రతిపాదనను అమలులోకి తెచ్చేందుకు రాజ్యాంగంలోని సమాఖ్య స్వరూపం స్ఫూర్తితో ఒక మెకానిజాన్ని రూపొందిస్తారని విశ్వసిస్తున్నా’’ అని జగన్‌ చెప్పారు. అలాగే ఆకాంక్ష (వెనుకబడిన) జిల్లాల అభివృద్ధికి సంబంధించి ఈ నెల 15న జరిగిన నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడించిన వ్యూహానికి మద్దతు పలుకుతున్నానని తెలిపారు.

tags : jagan

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info