A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రత్యేక హోదా హామీ నిలుపుకోలేదుగా..జగన్ ప్రశ్న
Share |
October 16 2019, 8:54 pm

రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు నెవరేర్చకపోవడం వల్లే చట్టసభలలో నిరసనలు వస్తుంటాయని ఎపి ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.ప్రదాని మోడీ సమక్షంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు.ఆ సారాంశంలో ఆయన ఇలా అన్నారు.
పార్లమెంటరీ విలువలు, సంప్రదాయాలపై నాకు అపార గౌరవం, భక్తి ఉన్నాయి. పార్లమెంట్‌ను నేను ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణిస్తాను. లోక్‌సభలో 22 మంది సభ్యులతో కూడిన నాలుగో అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడిగా నేనొక మౌలిక ప్రశ్నను మీ ముందుంచుతున్నా. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు 2014, ఫిబ్రవరిలో ముందస్తు షరతుగా నూతన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో పార్లమెంట్‌ స్పష్టమైన హామీ ఇచ్చింది. దీన్ని ఐదేళ్లయినా నెరవేర్చకపోతే ప్రజాస్వామ్య దేవాలయంగా కొలుస్తున్న పార్లమెంట్‌ను ప్రజలు ఇంకా ఎంతకాలం విశ్వసిస్తారు? మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించగల సామర్థ్యం ఉండి.. ఆ విభజనకు ముందస్తు షరతుగా విధించిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చగలిగే సామర్థ్యం లేకపోవడాన్ని పార్లమెంట్‌ ఎలా సమర్థించుకుంటుంది? ఇది ఏరకమైన న్యాయం? ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవాలంటే, గౌరవాన్ని పొందాలంటే పార్లమెంట్‌ ఇచ్చిన ప్రతి హామీని నిర్ణీత వ్యవధిలో, తూచా తప్పకుండా అమలు చేయడం తప్పనిసరి. అప్పుడే బాధిత పార్టీలు సభలో ఆందోళన చేయడం ఆపుతాయి’ అని జగన్‌ అన్నారు.

tags : jagan

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info