A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ పై కరీంనగర్ ఎమ్.పి ఫైర్
Share |
October 22 2019, 2:53 am

ఉగ్రవాద మూలాలను అంతం చేస్తామని మాత్రమే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారని బిజెపి ఎమ్.పి బండి సంజయ్ చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఘటనలు స్థానికుల సహకారం లేకుండా జరిగాయా? అని ప్రశ్నించారు. దేశ ప్రధానిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు హర్షించరన్నారు.
రైతుల ఆత్మహత్యలు చూశాం కానీ.. విద్యార్థుల ఆత్మహత్యలు కేవలం తెలంగాణలోనే చూస్తున్నామని సంజయ్‌ దుయ్యబట్టారు. విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించని సీఎంగా కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. దిల్లీకి వచ్చి పొర్లు దండాలు పెట్టడం.. హైదరాబాద్‌లో కేంద్రం మెడలు వంచుతామంటూ ప్రగల్భాలు పలకడం కేసీఆర్‌కే చెల్లిందని ఆయన వ్యాఖ్యానించారు.

tags : bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info