A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేను యూరప్ వెళ్తున్నా కాని...
Share |
July 17 2019, 12:44 am

కార్యకర్తలకు అండగా నిలవాలని ఎపి ప్రతిపక్ష నేత,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. ఆయన యూరప్ వెళుతూ పార్టీ నేతలకు కొన్ని జాగ్రత్తలు చెప్పారని సమాచారం వచ్చింది.అందులో కూడా టిడిపి కార్యకర్తలపై దాడులు అటూ ప్రస్తావించడం విశేషం. కార్యకర్తలపై దాడులు జరిగిన ప్రాంతాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొన్ని బృందాలుగా ఏర్పడి వెళ్లాలని చంద్రబాబు చెప్పారు. శాసనమండలిలో తెదేపా పక్ష నేత యనమల రామకృష్ణుడు, ఉభయ సభల్లోని పార్టీ ఉపనాయకులు ఈ బృందాలకు సారథ్యం వహించాలని, కార్యకర్తలకు అండగా నిలవాలని పేర్కొన్నారు. ఆయా జిల్లాల నాయకుల్ని వెంట తీసుకెళ్లి ఎస్పీలను కలిసి ఫిర్యాదు చేయాలని సూచించారు.గ్రామాలలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడాలని ఆయన అన్నారు. చంద్రబాబు యూరప్ వెళుతూ టిడిపి నేతలకు ఇలా చెబుతున్నారన్నమాట.ఆయన తిరిగి 24 వ తేదీనాటికి ఇండియాకు వస్తారు.

tags : babu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info