A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
2022 లోపే కులం,మతం అవినీతిపోవాలి-బాబు
Share |
July 18 2019, 9:00 am

దేశంలోని వివిధ జిల్లాల మద్య పోటీ వాతావరణం ఉండరాదని ఎపి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు . ఆయన ప్రదాని మోడీకి అఖిలపక్ష సమావేశం సందర్భంగా లేఖ రాశారు.అందులో వివిధ అంశాలను ఆయన ప్రస్తావించారు.డెబ్బైఐదో స్వాతంత్ర దినోత్సవం గురించి ఆయన రాస్తూ
‘2022లో మనం 75వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకుంటాం. 2022లోనే జీ-20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమిస్తోంది. ఆ సదస్సుకు ముందే... మత, కుల, ఉగ్రవాద, అవినీతి, క్రోనీ క్యాపిటలిజం వంటి దుర్లక్షణాల నుంచి విముక్తమైన నవ భారతాన్ని మనం ఆవిష్కరించాలి. దీనిని సాధించేందుకు ప్రజల మధ్య సమష్టి సంకల్పం కావాలి. రైతుల కష్టాలు తీర్చడం, యువతకు ఉపాధి కల్పన, మహిళా సాధికారత, సమాజంలోని వివిధ వర్గాల మధ్య అంతరాల్ని తొలగించడంపై దృష్టి పెట్టాలి’ అని సూచించారు.
గాంధీ 150వ జయంత్యుత్సవాల నిర్వహణపై కూడా తన అబిప్రాయాన్ని తెలియచేస్తూ ఇలా అన్నారు.
‘మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల్లో మా పార్టీ మనస్ఫూర్తిగా పాల్గొంటుంది. 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన మహనీయుడు ఆయన. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగుతుంది. ఆయన ఆలోచనలు, భావజాలాన్ని భవిష్యత్తు తరాలకు అందజేసేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

‘దేశంలోని జిల్లాల మధ్య పోటీ వాతావరణం సృష్టించడంవల్ల వివిధ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలు వివక్షకు గురయ్యే అవకాశం ఉందన్నది మా అభిప్రాయం. దేశంలోని అన్ని జిల్లాల సమతులాభివృద్ధికి ఈ కార్యక్రమాన్ని సమీక్షించాల్సి ఉంది’ అని అభిప్రాయపడ్డారు.

tags : chadnrababu, capitalisam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info