A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబే బిజెపిలోకి పంపుతున్నారు-వైసిపి
Share |
October 22 2019, 2:21 am

ఎపి తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను ఆ పార్టీ అదినేత,ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే బిజెపిలోకి పంపుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభిప్రాయపడింది. అయినా రాజీనామాలు చేయించకుండా ఈ ఎమ్.పిలను బిజెపిలోకి చేర్చుకోరాదని సూచించింది. పార్టీ ప్రదాన కార్యదర్శి సి.రామచంద్రయ్య మాట్లాడుతూ చంద్రబాబు తనకు సన్నిహితులైన ఎమ్.పి లను బిజెపిలోకి పంపారని,ఇదంతా తనపై కేసులు రాకుండా జాగ్రత్తపడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో సన్నిహితుడైన నామా నాగేశ్వరరావును టిఆర్ఎస్ లోకి పంపించారని ఆయన అన్నారు.ఓటు కు నోటు కేసు సమయంలో కూడా చంద్రబాబు పలు రకాలుగా ప్రయత్నాలు చేసిన సందర్భం గుర్తుంచుకోవాలని రామచంద్రయ్య అన్నారు.సుజాన చౌదరిపై వేల కోట్ల రుణాల ఎగవేత ఆరోపణలు వచ్చాయని ఆయన అన్నారు.బిజెపిని తీవ్రంగా దూషించినవారిని కూడా పార్టీలో చేర్చుకున్నారని అన్నారు.విలువలు పాటించాలని కోరుతున్నామని, రాజీనామాలు చేయించి బిజెపిలో చేర్చుకోవాలని రామచంద్రయ్య అన్నారు.

tags : chandrababu, bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info