A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపిలో సంక్షోభం-చంద్రబాబు కామెంట్
Share |
July 18 2019, 7:53 am

తెలుగుదేశం పార్టీ ని భారతీయ జనతా పార్టీ చీల్చే యత్నాలు చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. బిజెపి చర్య దారుణమని ఆయన ఖండించారు.తెలుగుదేశం పార్టీ ఇలాంటి సంక్షోభాలను గతంలో కూడా ఎదుర్కుందని ఆయన అన్నారు. కార్యకర్తలు ,నేతలు అదైర్యపడవద్దని ఆయన అన్నారు.ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.తాము కేంద్రంపై గతంలో పోరాడింది ఎపి ప్రయోజనాల కోసమేనని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.ప్రత్యేక హోదా కోసం టిడిపి పోరాడిందని, అది ఎవరికి వ్యతిరేకంగా కాదని ఆయన అన్నారు.

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info