A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపికి దెబ్బమీద దెబ్బ-కాపునేతల భేటీ
Share |
October 22 2019, 2:24 am

తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బ తగిలేలా ఉందని వార్తలు వస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన కాపు నేతలు ప్రత్యేకంగా సమావేశం అవడం కలకలం రేపుతోంది.వారిలో అత్యదికులు టిడిపి మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆద్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. వీరు కూడా బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. జ్యోతుల నెహ్రూ,బోండా ఉమామహేశ్వరరావు,పంచకర్ల రమేష్ బాబు,ఈలి నాని, వరుపుల రాజా , మీసాల గీత, కె.ఎ. నాయుడు తదితర మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను ఎదుర్కోవడం కష్టం కనుక బిజెపిలోకి వెళ్లడం బెటర్ అని వీరు భావిస్తున్నారు. కాగ ఎపి బిజెపి అద్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నందున, కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించడం ద్వారా ఎపిలో బిజెపి ఎదగాలన్నది ఆ పార్టీ నేతల వ్యూహంగా ఉందని చెబుతున్నారు.

tags : tdp, kapu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info