A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జెసి ప్రభాకరరెడ్డి నిజమే చెబుతున్నారా
Share |
July 17 2019, 12:22 am

తన సోదరుడు జె సి దివాకరరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నా, తాను మాత్రం కొనసాగుతానని మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి అన్నారు. తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటానని ఆయన చెప్పారు.గత ఐదేళ్లలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూశామని ఆయన చెప్పారు. ఆ ధైర్యంతోనే ఇప్పటికీ ప్రజలను నేరుగా వెళ్లి కలుస్తున్నామన్నారు. అంతేగానీ, ప్రజాప్రతినిధి అని ఎక్కడా నియంతలా వ్యవహరించలేదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. వైసీపీ వర్గీయులు టీడీపీ వర్గీయులు, ప్రజలపై అనవసరంగా దాడులకు దిగడం.. రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు.


నిజంగానే తాడిపత్రిలో గత ఐదేళ్లలో ఏమి జరగలేదా?మరి అనేక వివాదాలు ఎందుకు వచ్చాయో ప్రభాకరరెడ్డి చె్పాలి కదా?

tags : jc

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info