A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలీస్ లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యేకి గాయాలు
Share |
July 17 2019, 12:23 am

హైదరాబాద్ లో జరిగిన పోలీసుల లాఠీ చార్జీలో బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ గాయపడ్డారు. జుమ్మేరాత్ బజార్ లో అర్దరాత్రి స్వాతంత్ర యోధురాలు, రాణి అవంతి భాయ్ లోధ్ విగ్రహాన్ని పునర్నిరంచేందుకుగాను కొందరు ప్రయత్నించారట.అయితే అనుమతి లేకుండా ఏయవద్దని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడకు వెళ్లారు.అయితే వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌, పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. రాజాసింగ్ ను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు తమపై అన్యాయంగా దాడి చేశారని రాజాసింగ్ ఆరోపించారు.

tags : rajasingh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info