A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైవి సుబ్బారెడ్డికి లైన్ క్లియర్
Share |
July 18 2019, 7:55 am

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేయడంతో మాజీ ఎమ్.పి.వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత వైవి సుబ్బారెడ్డి ఆ పదవి చేపట్టడానికి లైన్ క్లియర్ అయింది. గురువారం ఇందుకు సంబందించిన ఆదేశాలు వస్తాయని, 22 వ తేదీన ఆయన ఆలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.ప్రకాశం జిల్లా మేదరమెట్టకు చెందిన సుబ్బారెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి జగన్ కు చిన్నాన్న అవుతారు. గతసారి ఒంగోలు నుంచి లోక్ సభకు ఎన్నిక కాగా, ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఈ ఎన్నికలలో ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇచ్చారు. ఈ నేపద్యంలో ఆయనకు టిటిడి పదవి ఇస్తున్నారని సమాచారం.

tags : yv subbareddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info