A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మళ్లీ కొణతాల లేఖ-ఉద్యమాంద్ర అవుతుందట
Share |
October 22 2019, 1:16 am

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టిడిపి నేత లోకేష్ వెనుక నిలబడిన మాజీ మంత్రి,సీనియర్ నేత కొణతాల రామకృష్ణ ఇప్పుడు మళ్లీ ఉత్తరాంద్ర గోడు అలకించండి అటూ లేఖలు రాయడం ఆరంబించారు.ఆయన రాసిన లేఖ ఇలా ఉంది.
నీళ్లు, నిధులు, నియామకాల్లో వెనుక బడిన ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలే, అవశేష ఆంధ్ర ప్రదేశ్‌ లో కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో నూత నంగా ఏర్పడిన వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ”ఉత్తరాంధ్ర గోడు” ఆలకించి, దానిపై ద ష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది, లేనిపక్షంలో సమీప భవిష్యత్‌ లోనే ఈ ప్రాంత ప్రజలలో చెలరేగుతున్న అసంత ప్తి తీవ్రమై ఉద్యమబాట పట్టే అవకాశం వుంది. అవశేష ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడిన ప్రాంతం అనడంలో ఎవ్వరికీ సందేహం లేదు. పుష్కలమైన సహజ వనరులు ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉండటం, కనీసం మౌలిక సదుపాయాలకు నోచుకోలేక పోవడం ఈ ప్రాంత ప్రజల దుస్థితికి తార్కాణం. ఈ విషయాన్నే జస్టిస్‌ శ్రీక ష్ణ కమిషన్‌ తమ నివేదికలో స్పష్టంగా గణాంకాలతో సహా పేర్కొన్నది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, నిర్లక్ష్యం అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొనసాగు తున్నాయి. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే ఉత్తరాంధ్ర ఉత్త ఆంధ్ర’గా మారిపోయే ప్రమాదం ఉన్నది. అని ఆయన హెచ్చరించారు.

tags : konatala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info