A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
Share |
July 17 2019, 12:42 am

రైళ్లలో మసాజ్ సేవలు అందించాలన్న ప్రతిపాదనను రైల్వే శాఖ ఉపసంహరించుకుంది.మద్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి ఈ సేవలను ఆరంబించాలని కొందరు రైల్వే అదికారులు ఆలోచించారు. తలకు,పాదాలకు మాసేజ్ చేసే సదుపాయాం ఇవ్వాలని భావించారు. కాని ఇండోర్ ఎమ్.పి లాల్వానీ, గత లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ దీనిపై అబ్యంతరం చెప్పారు. ఇది మన సంస్కృతికి విరుద్దమని, మహిళల భద్రతకు సంబందించిన విషయమని వారు హెచ్చరించారు.దాంతో అదికారులు దీనిపై వివరణ ఇచ్చారు.రత్లాం డివిజన్ లో ఈ ఆలోచన జరిగిందని, అయితే దీనిపై ఇండోర్ ఎమ్.పి పిర్యాదు చేయడంతో ఉన్నతాదికారులు ఈ మాసేజి సేవల ప్రతిపాదనను నిలుపుదల చేయాలని ఆదేశించారని ప్రకటించారు.

tags : train,massage

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info