A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
Share |
July 16 2019, 11:46 pm

వందకు వెయ్యి శాతం గెలుస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు తమకు కూడా ఎన్నికల ముందు అనుమానం వచ్చేలా మాట్లాడారని ,కాని అంతిమంగా ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు వల్ల తాము అదికారంలోకి రాగలిగామని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పాలనలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఈనాటి ముఖ్యమంత్రి జగన్ కు ఉన్న తేడా ఇప్పటికే తెలుస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు పదవీ స్వీకారం సందర్బంగా బెల్ట్ షాపుల రద్దు పైల్ పై తొలి సంతకం చేశారని, కాని అది అమలు చేయలేదని, తమ నేత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిని అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టును 2018 లో పూర్తి చేస్తాం..రాసుకో అని చెప్పిన వారు ఏమయ్యారని ,జగన్ ను ఇష్టం వచ్చినట్లు దూషించినవారంతా ఓటమి చెందారని, ఒక్క అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారని, వచ్చేసారి ఆయన కూడా గెలవరని ఆయన అన్నారు. కాగా అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని ఓడిపోయినా సమర్దవంత పాలన అందించామని నమ్ముతున్నామని అన్నారు.ఓడిపోయినంతమాత్రాన అసమర్దులు అని అనుకోవద్దని ఆయన అన్నారు.రాంబాబు కూడా గతంలో పలుమార్లుఓడిపోయారని ఆయన అన్నారు.రాంబాబు సమాధానం ఇస్తూ అచ్చెన్నాయుడు ఓదార్పు మాటలు చెబుతున్నారని ఆయన అన్నారు. ప్జలు మిమ్మల్ని అసహ్యించుకున్నారని గుర్తించాలని ఆయన సూచించారు. అచ్చెన్నాయుడు ఇలాగే మాట్లాడితే భగవంతుడు కూడా రక్షించలేడని అన్నారు.టిడిపి పెట్టిన తర్వాత ఇంత తక్కువగా సీట్లు వచ్చాయా అని ఆయన అన్నారు.

tags : rambabu, acchennaidu

Latest News
*కాపు టిడిపి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చెబుతున్నారు
*టిడిపిలా మాది కులపిచ్చి పార్టీ కాదు- అంబటి
*కాపులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్
*గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లు
*కూలిన భవనం -శిధిలాలలో నలభై మంది
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*అవినీతి ఆరోపణలపై వైసిపి ముందుకు వెళ్లాలా?వద్దా
*కర్నాటకలో ఇక ఎమ్మెల్యేలపై పోలీస్ ప్రయోగం
*పాక్ గగనతలం నుంచి ప్రయాణించవచ్చు
*బుగ్గన బడ్జెట్ కొత్త పుంతలు..కాని సందేహాలు
*'వైసిపి ప్రభుత్వం సందేహాలతోనే--బుచ్చయ్య చౌదరి
*దొబ్బేశారని ఎందుకు అన్నానంటే..మంత్రి
*చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం..
*జగన్ ను అబినందించిన బిసి నేతలు
*డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని అనలేదు
*కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారా
*ఎపికి కొత్త గవర్నర్ నియామకం -హరిచందన్
*జగన్ ను అబినందించిన సినీ ప్రముఖుడు
*అవినీతి అన్నది తగ్గుతోందా- కలెక్టర్ లతో జగన్
*అవును ఆ ఆస్తి కాజేశాను..కేశినేని ట్వీట్
*చెప్పింది 43 లక్షల ఉద్యోగాలు..వచ్చింది 30 వేలు
*అచ్చెన్నాయుడు వివాదం- ఇబ్బందిపడ్డ చంద్రబాబు
*బిజెపిలో మాజీ ప్రధానమంత్రి కుమారుడు
*పోలవరం ప్రాజెక్టులో 2343 కోట్ల అదనపు చెల్లింపులు
*కోడెల కుటుంబంపై వైసిపి ఎమ్మెల్యే ఆరోపణ
*అచ్చెన్నాయుడు ద్వేషపూరిత మాటలు చూడండి
*చంద్రబాబుతో నాగం భేటీ ఆంతర్యం
*ఎపి స్కూళ్లలో బయోటాయిలెట్స్
*కొత్తగా ఎపిలో మూడు స్టేడియం లు
*బుద్దిఉన్నవాడు బిజెపిలో చేరతాడా
*ఇంగ్లాండ్ మాదిరి గెలుస్తాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info