A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
Share |
July 18 2019, 7:59 am

గవర్నర్ ప్రసంగంలో రాజధాని అమరావతి గురించి ఒక్క ప్రస్తావన లేకపోవడం బాదాకరమని టిడిపి ఉప నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఈరోజు మీరు ఇక్కడ పాలన చేయగలుగుతున్నారంటే అది చంద్రబాబు నిర్మించిన సచివాలయ భవనాల వల్ల,ఈ రోజు ఇక్కడ అసెంబ్లీలో కూర్చున్నామంటే అది చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన భవనాల వల్ల అని ఆయన అన్నారు. కాని అమరావతి రాజధాని గురించి ఒక్క మాట కూడా లేకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. రాజదానిని ఏ రకంగా అబివృద్ది చేస్తారో చెప్పాలని కోరుతున్నామని ఆయన అన్నారు. అయితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ఓటుకు నోటు కేసు అని ఎద్దేవ చేశారు. ఆ కేసులో పట్టుబడిన తర్వాత చంద్రబాబు హడావుడిగా విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే.అయితే అచ్చెన్నాయుడు తన ప్రసంగంలో ప్రజలకు దగ్గరగా పాలన అందించడానికి అని చెప్పగా, అదికార పక్షం ఓటు కు నోటు అని వ్యాఖ్యానించారు.

tags : acchennaidu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info