A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
Share |
July 18 2019, 8:41 am

గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో సర్వసాధరణమని టిడిపి ఉప నేత కె.అచ్చెన్నాయుడు అన్నారు.తాము ఈ అంశంపై విశ్లేషణ చేసుకుంటామని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి దన్యవాదాలు తెలిపే చర్చలో ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్ అని ,ఇది మొదటి ప్రసంగం అని ఆయన అన్నారు. ఐదేళ్లలో ఈ రాష్ట్రానికి చేయవలసిన సంక్షేమం ,అభివృద్ది ని ప్రతిబింబించే విదంగా ఉంటుందని అనుకున్నానని, కాని అది కనిపించలేదని అన్నారు. ఐదేళ్లకు కాకపోయినా, ఈ ఏడాదికైనా అబివృద్ది గురించి ఉంటుందని అనుకున్నామని ,కాని అది కూడా లేదని ఆయన అన్నారు.మా ఐదేళ్ల ప్రభుత్వంలో కూడా గవర్నర్ నరసింహన్ ప్రసంగం చేశారని, ఆయన అప్పట్లో బాగా చేశారని అన్నారని, కాని ఒక్క రోజులోనే అదే గవర్నర్ తమ ప్రభుత్వం అవినీతి చేసిందని చెప్పడం బాదాకరమని అచ్చెన్నాయుడు అన్నారు.మంత్రి బుగ్గన మాట్లాడుతూ గవర్నర్ సొంత ప్రసంగం కాదని ,ప్రభుత్వం ఇచ్చే డాక్యుమెంట్ చదువుతారని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.ఐదేళ్లలో సమర్దవంతమైన పాలన అందించామని తాము చెప్పగలుగుతున్నామని ఆయన అన్నారు.65 ఏళ్లలో ఎంత సంక్షేమం జరిగిందో, అంత ఈ ఐదేళ్లలో జరిగిందని అచ్చెన్నాయుడు అన్నారు.మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జోక్యం చేసుకుని మేం బాగా చేశామని ,అందుకే ఓడించారని ఆయన చెబుతున్నారని ఎద్దేవ చేశారు. నీరు,చెట్టు లేకుండా పదమూడువేల కోట్ల రూపాయలు కాజేసిన చరిత్ర టిడిపిదని ఆయన అన్నారు.ఆలీబాబు నలభై దొంగల్లా టిడిపి వారు దోచుకున్నారని మంత్రి విమర్శించారు.

tags : accennaidu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info