A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నేడు సచివాలయ భవనాల అప్పగింత
Share |
July 17 2019, 12:32 am

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంలో భాగంగా సోమవారం కీలకమైన భవనాల అప్పగింత కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రభుత్వానికి హైదరాబాద్‌లో కేటాయించిన భవనాలను తిరిగి అప్పగించనున్నట్టు ఏపీ అధికారులు.. తెలంగాణ అధికారులకు స్పష్టంచేశారు. సచివాలయంలోని పలు బ్లాకులతోపాటు, ఏపీ డీజీపీ కార్యాలయ భవనం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లను తెలంగాణకు అప్పగించనున్నారు. సచివాలయంలోని అన్ని బ్లాకులు తెలంగాణ ఆధీనంలోకి రానుండటంతో ఈ నెల 27న నూతన సచివాలయానికి శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం విజయవాడ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ర్టాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలపై కూడా చర్చించనున్నారు.

tags : kcr, jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info