A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
Share |
August 5 2020, 4:04 am

తెలుగుదేశం పార్టీ అదినేత ,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమి చెబుతున్నారో చూడండి. గతంలో ఓడిపోతే కారణాలు తెలిసేవని, కాని ఈసారి కారణాలు కూడా తెలియడం లేదని అన్నారట. ఇంతకన్నా విడ్డూరం ఏమైనా ఉంటుందా?గతంలో టిడిపి ఓడిపోయినప్పుడు కారణాలు తెలుసుకోగలిగిన ఆయన ఈసారి అలా చేయలేకపోయారంటే ఏదో లోపం అయి ఉండాలి.ఆయన ఇంకా భ్రమ,బ్రాంతులలోనే బతుకున్నారను కోవాలి.ఆ తర్వాత కొందరు నేతలు టిడిపి వర్క్ షాప్ లో మాట్లాడిన విషయాలు విన్న తర్వాత కూడా చంద్రబాబుకు అర్దం కాలేదని అంటే ఆయన నటిస్తున్నారని అనుకోవాలి. చంద్రబాబు ఏరికోరి వైసిపి నుంచి రప్పించుకున్న జూపూడి ప్రభాకర్ ఏమన్నారో గమనించారు కదా! టిడిపిలో మానవ సంబందాలు కొరవడ్డాయని ఆయన అన్నారు.అంటే వ్యాపార సంబంధాలు పెరిగాయని చెప్పకనే చెప్పారు కదా.సరే..జూపూడి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో ఉండగా ఒక వెలుగు వెలిగారు. పార్టీ 2014 లో అదికారంలోకి రాకపోవడంతో ఆయన ఇక్కడ మానవ సంబందాలను వదలుకుని టిడిపిలోకి వెళ్లిపోయారు. అది వేరే విషయం. కాని తెలుగుదేశం పార్టీని దగ్గరగా చూసిన వ్యక్తిగా ఏకంగా మానవ సంబందాలే పార్టీలో లేవని అన్నారంటే ఆ పార్టీ ఓటమికి ఇంతకన్నా పెద్ద కారణం ఏమి ఉండాలి. అంటే ప్రజలను కూడా మానవ సంబందాలతో కాకుండా వ్యాపార సంబందాలతో చూశారనే కదా దాని అర్దం.ఎమ్మెల్యేలు,పార్టీ నేతలు జనం మీద పడి పీడించారని చెప్పకనే చెప్పారని కదా..అంతెందుకు మరో నేత దివ్వవాణి ఏమన్నారు..మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అరాచకాలకు పాల్పడితే మళ్లీ ఆయనకే టిక్కెట్ ఎలా ఇచ్చారని ప్రజలు అడిగారని ఆమె వెల్లడించారు. అంటే ఇది కూడా ఒక కారణమని చెప్పడమే కాదు..ఇక సీనియర్ నేత అశోక్ గజపతి రాజు టెలికాన్ఫరెన్స్ ల తీరును తప్పు పట్టారు.వేలాది మంది తో ఆ కాన్పరెన్స్ లు నడపడం వల్ల నిజాలు చెప్పలేకపోయారని అన్నారు.అంటే దానర్దం టిడిపి నేతలు, కార్యకర్తలు ఒకరికొకరు అబద్దాలు చెప్పుకుని మోసం చేసుకన్నారని అశోక్ చెప్పినట్లే కదా..వాళ్లను వాళ్లు మోసం చేసుకోవడమే కాదు.ప్రజలను కూడా మోసం చేశారని అర్ధం చేసుకోవచ్చు.చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకోవడం కన్నా, సాకులు వెతకాలని అనుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక వైపు ఈవిఎమ్ లపై ఆరోపణలు చేస్తూనే తెలుగుదేశం కు 130 సీట్లు అని ఒకసారి,150 సీట్లు వస్తాయని మరోసారి చెప్పారు కదా..కాని వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 151 సీట్లు వచ్చాయి.నిజానికి చంద్రబాబు అలవాటు ప్రకారం ఈవిఎమ్ లు,సీట్ల విషయంలో రకరకాల మాటలు మార్చారుకాని, ఆయనే కనుక ఈవిఎమ్ ల టాంపరింగ్ వల్ల ఓడిపోబోతున్నామని చెప్పగలిగి ఉంటే కొంతమందైనా ఆయన చెప్పినదానిలో ఏమైనా నిజం ఉందేమో అనుకునేవారు.కాని అలా కాకుండా ఆయనే రెండు మాటలు మాట్లాడేసరికి విలువ లేకుండా పోయింది.నిజానికి చంద్రబాబు ఇప్పుడు కూడా మెల్లగా తన ఓటమిని ఈవిఎమ్ లపై నెట్టాలని అనుకున్నట్లే అనిపించింది.కారణాలు తెలియడం లేదని అనగానే అక్కడ సమావేశంలో ఉన్న నేతలంతా అవును..అవును..మనం చాలా చేశాం..కాని ఓడిపోయాం అని అంటే ఈవిఎమ్ లే కారణం అని చెప్పాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.కాని అక్కడ ఉన్న నేతలకు ఆ విషయం అర్దం కాక నిజమైన కారణాలు చెప్పేశారు. బొమ్మరిల్లు సినిమాలో తండ్రి పాత్ర ఒకటి ఉంటుంది.అన్నీ తానే చేసేస్తుంటే, కొడుకు నిస్పృహకు గురై చివరికి అన్నీ నువ్వే చేశావు..అని ఆవేశంగా తండ్రిని విమర్శిస్తాడు..అలాగే చంద్రబాబు కూడా గత టరమ్ లో ఆయనే కార్యకర్త,ఆయన ఎమ్మెల్యే, ఆయనే మంత్రి,ఆయనే ముఖ్యమంత్రి అ్న చందంగా ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఉపన్యాసాలతో హోరెత్తించారు.ఏ పని అయినా ,కాకపోయినా, అంతా అయిపోయినట్లు హోరెత్తించే ప్రయత్నంచేశారు.దానికి తోడు తెలుగుదేశం మీడియా శరభ..శరభ అంటుంటూ సోషల్ మీడియా మాత్రం వెల్లువలా మారి తెలుగువేశం పార్టీని కౌంటర్ చేసింది.ఇన్ని ఎందుకు ఒక్కసారి వెబ్ సైట్ లో నుంచి తీసేసిన 2014 నాటి తెలుగుదేశం ఎన్నికల ప్రణాళిక కాపీ బహుశా చంద్రబాబు వద్ద ఉండి ఉండాలి.దానిని ఒకసారి ఆయన దగ్గర పెట్టుకుని చదువుకుని , అందులో ఏమి ఉంది..తాను ఏమి చేసింది ..చంద్రబాబు తెలుసుకోగలిగితే తెలుగుదేశం ఓటమికి ఎన్ని కారణాలు కావాలంటే అన్ని దొరుకుతాయి.నిజానికి ఇంత జగన్ సునామీలో తెలుగుదేశం కు ప్రతిపక్ష హోదా దక్కడమే పెద్ద విషయంగా భావించాలి.ఇప్పటికైనా చంద్రబాబు కాని, ఆ పార్టీ నేతలు కాని భ్రమలలో నుంచి బయటకు వస్తే మంచిది.లేకుంటే వారికే నష్టం.

tags : tdp,defeat

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info