A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
Share |
October 22 2019, 1:17 am

గిరిజన కుటుంబాల పెద్దలపై తెలంగాణ అటవీ శాఖ అదికారులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.కుమ్రంభీం జిల్లా కోమలగొండి ఆదివాసీల నిర్బంధంపై హైకోర్టు విచారించిన సందర్భంలో అదికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.జంతువులను చూసినట్టు అదివాసులను చూస్తారా అని మండిపడింది. కుటుంబానికి ఒక్కరి చొప్పున 16 మంది ఆదివాసీలను అటవీశాఖ అధికారులు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ముందు హాజరుపర్చారు. కోమలిగొండి నుంచి బలవంతంగా తరలించారని బాధితులు కోర్టుకు తెలిపారు. కోమలగొండి వాగు దగ్గర 91 ఎకరాలను 67 మంది ఆదివాసీలకు కేటాయించాలి. ఏడాది లోపు ఆదివాసీలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. పునరావాసంతో పాటు విద్య, వైద్యం అందించాలని హైకోర్టు అదికారులకు ఆదేశాలు ఇచ్చింది.

tags : highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info