A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు షాక్-బిజెపిలోకి కోమటిరెడ్డి
Share |
October 16 2019, 8:44 pm

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరిక దాదాపు ఖాయమైనట్లే ఉంది. ఆయన సోదరుడు భువనగిరి ఎమ్.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను పార్టీ మారబోనని చెప్పిన రెండు రోజులకే రాజగోపాలరెడ్డి సంచలన వ్యఖ్యలు చేశారు. తెలంగాణలో టిఆర్ఎస్ కి బిజెపినే ప్రత్యామ్నాయమని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఘోరంగా తయారైందన్నారు. పార్టీ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాల వల్లే రాష్ట్రంలో పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందని, తెలంగాణలో కాంగ్రెస్‌ ఇప్పట్లో కోలుకొనే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. . దేశమంతా భాజపావైపే చూస్తోందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ను మార్చనందుకే కాంగ్రెస్‌ ఓటమిపాలైందని ఆరోపించారు. భాజపాలో చేరడంపై కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు.ఇప్పుడు పిసిసి అద్యక్ష బాద్యతలు అప్పగించినా ప్రయోజనం లేదని ఆయన అన్నారు.

tags : komatireddy,bjp

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info