A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రత్యేక హోదాపై జగన్ సమర్ద వాదన
Share |
July 18 2019, 8:40 am

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక హోదా అంశంపై నీతి ఆయోగ్ సమావేశంలో సమర్దంగా తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు.ఎపి విభజన వల్ల బాగా నష్టపోయిందని ఆయన తెలిపారు.హైదరాబాద్ ఆర్దికంగా అబివృద్ది చెందిన నగరం కాగా, ఆ స్థాయిలో ఎపిలో ఒక్క నగరం లేదని ఆయన అన్నారు.ఉద్యోగ,ఉపాది అవకాశాలు లేక ఎపి యువత వలస పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంటులో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, దానిని నెరవేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రధాని ఇచ్చిన హామీ నెరవేర్చాలని అన్నారు. ఎపి కి విభజన సమయంలో 99 వేల కోట్ల అప్పులు ఉండగా, ఇప్పుడు అది 2.58 లక్షల కోట్లకు చేరాయని ఆయన చెప్పారు. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రం కాగా, ఎపి లోటు రాష్ట్రం అని, ఆర్దిక సంఘం 23 వేల కోట్ల లోటు లో ఉన్నట్లు ఆర్దిక సంఘం తెలిపిందని, కాని ఇది 66 వేల కోట్లు ఉంటుందని ఆయన చెప్పారు.కాగా మన్మోహన్ సింగ్ క్యాబినెట్ ప్రత్యేక హోదాపై తీర్మానం చేసిందని, దానిని రద్దు చేయలేదని ఆనాటి ప్లానింగ్ కమిషన్ సభ్యుడు అబిజిత్ సేన్ రాసిన లేఖను కూడా జగన్ తన ప్రసంగంలో ప్రస్తావించి ఆ కాపీని జత చేశారు.

tags : jagan, special status

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info