A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడి కత్తి అని అవహేళన చేశారుగా..
Share |
June 25 2019, 3:01 pm

టీడీపీ కార్యకర్తల పై దాడులు జరుగుతున్నాయి అని ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత ,ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. టీడీపీ హయాంలో జరిగిన దాడులు, హత్యలపై ఒక్క విచారణ అయినా జరిపారా? అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై దాడి జరిగితే కోడి కత్తి అని అవహేళన చేశారు. మ్యానిఫెస్టోలోని నవరత్నాలను సెక్రటేరియట్‌లో పెట్టించిన వ్యక్తి సీఎం జగన్‌మోహన్ రెడ్డిని ప్రజలు ప్రశంసిస్తున్నారు. కానీ మ్యానిఫెస్టోని వెబ్‌సైట్ నుంచి తొలగించిన వ్యక్తి చంద్రబాబు. విశ్వసనీయత లోపించింది కాబట్టే మ్యానిఫెస్టోని తీసేశారు. పోలవరం పేరు చెబితే ఎందుకు మీకు అంత కలవరం? కాగ్ పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని తేల్చింది. ఐదు సంవత్సరాలలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుంది. రివర్స్ టెండరింగ్ అంటే మీకు ఉలుకు ఎందుకు? కరకట్ట దగ్గర అక్రమ కట్టడాలు అని చెప్పిన చంద్రబాబు..జిల్లా కలెక్టర్‌తో అక్కడ వుండే వారికి నోటీసులు ఇచ్చారు. మీ జలవనరుల శాఖ మంత్రి 21 కట్టడాలను తొలగిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ఆచరణకు నోచుకోలేదు...రూ. 4.3 కోట్లు పెట్టి అక్రమమైన స్థలంలో ప్రజావేదిక కట్టారు. గ్రీన్ ట్రిబ్యునల్ రూ. 100 కోట్లు జరిమానా వేసినా ఖాతరు చేయలేదు. చివరకు బ్రిటిష్ చట్టాలను సైతం బేఖాతరు చేశారు. కరకట్టను సైతం షిఫ్ట్ చేసే సరిపోతుందని ప్రపోజల్ పెట్టిన వ్యక్తులు చంద్రబాబు, లోకేష్. సామజిక కార్యకర్తలు మేధా పాట్కర్, వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ సైతం పర్యటించి కృష్ణా నది లో ఇసుక తవ్వకాలపై ప్రమాద గంటికలు ఉన్నాయని హెచ్చరించారు. కృష్ణానదిని ఆక్రమించి కొత్త హైలాండ్ నిర్మించాలని కుట్ర చేశారు. చంద్రబాబు. ప్రజావేదికను తనకు కేటాయించమనడం దుస్సాహసమే. అక్రమ కట్టడాలపై మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తే మరోసారి ఎన్నికల్లో భంగపాటు తప్పదు’ అని చంద్రబాబు పై ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.

tags : ummareddy

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info