A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ లో ఇసుక ద్వారా భారీ ఆదాయం
Share |
September 17 2019, 3:59 pm

తెలంగాణలో అనుసరిస్తున్న ఇసుక విక్రయ విధానాన్ని ఎపి ప్రభుత్వం కూడా పరిశీలించవచ్చేమో ఆలోచించవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో ఖనిజాభివృద్ది సంస్థ ద్వారా ఇసుకను సమీకరించి విక్రయిస్తున్నారు. రానున్న వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా ఉండేందుకు గాను, పెరిగిన నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఇసుక స్టాక్ యార్డులను ఏర్పాటు చేశారు. ఇప్పటికి 369 స్టాక్ యార్డులు ఉండగా, మరో ఆరుగ స్టాక్ యార్డులను హైదరాబాద్ పరిసరాలలో ఏర్పాటు చేశారు.ఇప్పటికే అరవై లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయగా, మరో నలభై లక్షల టన్నులు, మొత్తం కోటి టన్నుల ఇసుకను సిద్దం చేస్తున్నారు. ఏడాదికి రెండున్నర కోట్ల టన్నుల ఇసుక అవసరం కాగా, అందులో 1.76 కోట్ల టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నారు.మిగిలిన ఇసుక ఇతర రాష్ట్రాల నుంచి వస్తోంది. ఆన్ లైన్ ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నారు.ఈ పద్దతి వచ్చిన తర్వాత ఇంతవరకు 2100 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. గత ఏడాది 886 కోట్ల ఆదాయం వచ్చిందని లెక్కగట్టారు. ఎపిలో ఉచితం గా ఇసుక ఇస్తామని చెప్పినా, మాఫియాలు విజృంభించి అటు వినియోగదారులకు,ఇటు ప్రభుత్వానికి లాభం లేకుండా చేశారు.కాని తెలంగాణలో మాత్రం అది మంచి ఆదాయ వనరుగా కూడా ఉంది.

tags : telangana, sand

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info