A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉత్తుత్తి విమాన హైజాక్- వ్యాపారికి ఐదు కోట్ల పైన్
Share |
June 25 2019, 3:33 pm

విమానం హైజాక్ కు గురి కాబోతోందంటూ ఒక వ్యాపారి రాసిన ఉత్తుత్తి బెదిరింపు లేఖ అతనిని జైలులోకి నెట్టింది.అతనికి జీవిత ఖైదు పడింది. బిర్జు కిషోర్ అనే ఈ వ్యాపారి ముంబై నుంచి డిల్లీ వెళ్లే జెట్ ఎయిర్ వేసే విమానంలో 2017 లో ప్రయాణించాడు. ఆ క్రమంలో అతడు ముందుగానే టైప్ చేసుకుని వచ్చిన ఒక లేఖను టాయిలెట్ లో టిష్యూపేపర్ బాక్స్ వద్ద పెట్టి వచ్చాడు. దానిని గమనించినవారు ఆ విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపారు. ఆ లేఖలో నలుగురు హైజాకర్ లు ఉన్నారని రాశారు.దాంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పైలట్ విమానాన్ని అహ్మదాబాద్ లో ఆకస్మికంగా దించవలసి వచ్చింది. ఆ తర్వాత అలాంటిది ఏమీ లేదని తేలింది.దాంతో ఈ తప్పుడు లేఖ రాసిన కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కేసు విచారణ తర్వాత అతనికి జీవిత ఖైదు తో పాటు ఐదు కోట్ల జరిమానా కూడా విధించారు. పైలట్లకు లక్ష రూపాయలు చొప్పున, ఎయిర్ హోస్టెస్ లకు ఏభై వేల చొప్పున, ప్రయాణికులకు ఒక్కొక్కరికి పాతిక వేల రూపాయలు చొప్పున పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.హైజాక్ నిరోధక చట్టం వచ్చాక ఇది తొలి శిక్షగా చెబుతున్నారు.

tags : highjack, case,

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info