A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి అవే అబద్దాలు చెప్పాలనుకుందా
Share |
September 17 2019, 4:21 pm

తెలుగుదేశం పార్టీ మళ్లీ అబద్దాలు ఆడడానికే కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలపై టిడిపి అదికార ప్రతినిది, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్ వరప్రసాద్ ఇచ్చిన సమాదానం చూడండి. ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం కొనసాగించనవసరం లేదని చెప్పారట.వంద చోట్ల టిడిపి కార్యకర్తలపై దాడులు జరిగాయట. ఆ ప్రకటన సారాంశం మొత్తం ఇలా ఉంది.
...................

రాజ‌కీయాల‌లో సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. చంద్రబాబు గారిపై
విద్వేష‌పూరితంగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబునాయుడు గారు ఆరోపణలే చేయలేదు కానీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో వైసీపీ దాడులు, దౌర్జన్యాలకు అదుపులేకుండా పోయింది. ఇప్పటివరకు రాష్ట్రంలోని సుమారు 100 చోట్లకు పైగా టీడీపీ కార్యకర్తలపై, వారి ఇళ్లపై వైసీపీ శ్రేణులు దాడులు చేసి భౌతికంగా గాయపరచడంతో పాటు ఆస్తులను ధ్వంసం చేశారు. పలు చోట్ల శిలాఫలాకాలు, జెండా దిమ్మెలు,టీడీపీ నేతల విగ్రహాలను సైతం ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై
అప్రజాస్వామికంగా వైకాపా శ్రేణులు చేస్తున్న దాడులను ఖండించడం తప్పా..? వైఎస్‌
జగన్మోహన్‌రెడ్డి సొంత బాబాయి వివేకానందరెడ్డి సొంత ఇంట్లోనే హత్యకు గురైతే దానిపై మీరు
మాట్లడకుండా.. చిత్తూరు జంట హత్యలపై విమర్శించడం ఏమిటి..? రైతులకు రావలసిన నాలుగో
విడత, ఐదో విడత రుణమాఫీని, అన్నదాత సుఖీభవను అందించి రైతులకు ఆదుకోమని
చంద్రబాబునాయుడు గారు కోరడం తప్పా..? ప్రజలకు ఉపయోగపడే పనులను చేయమనడం
కోరడం మీ దృష్టిలో నేరమా..? పోలవరం ప్రాజెక్టుపై మీ నాయకుడు గత 15 రోజుల్లోనే ఎన్ని
మాటలు మార్చారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మూడ్రోజులు
ముగియకుండానే పోలవరం ప్రాజెక్టును కొనసాగించాల్సిన అవసరం రాష్ట్రానికి లేదనడం..
ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్లి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావలసిన నిధులపై

ప్రస్తావించకపోవడం బాధాకరం. ప్రజాప్రయోజనాలపై మాట్లాడినందుకు తీవ్ర పదజాలంతో మీరు
విమర్శించడం హుందాతనంగా లేదు. మేము చేసే నిర్మాణాత్మక సూచనలను, సద్విమర్శలను
పరిగణలోకి తీసుకునే విజ్ఞత లోపించడం బాధాకరం. రాష్ట్ర అభివృద్ధి పట్ల, పేదల సంక్షేమం పట్ల
బాధ్యతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

డొక్కా మాణిక్ వర ప్రసాద్

tags : tdp

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info