A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల టాక్స్ పిర్యాదుదారులు పెరుగుతున్నారు
Share |
September 17 2019, 3:58 pm

స్పీకర్ గ సఫలం అవడ, విఫలం అవడం వేరు.కాని ఈరకంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అప్రతిష్ట పాలు కావడం విషాదమే. ఆయన కుటుంబ సభ్యులవల్లే పరువు పోగొట్టుకోవలసిన స్తితిలో ఆయన ఉన్నారు. ప్రభుత్వం మారడంతో కె.టాక్స్ పేరుతో వసూలుచేసిన సొమ్మును తిరిగి ఇవ్వాలంటూ పలువురు బాదితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారంటేనే అర్దం చేసుకోవచ్చు. కోడెల కుటుంబం ఎంతగా ప్రజలను వేదించింది తెలుస్తుంది. గుంటూరు అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు నిర్వహించిన పోలీస్‌ గ్రీవెన్స్‌లో సత్తెనపల్లికి చెందిన ఓ బిల్డర్‌ కోడెల ట్యాక్స్‌ (కే ట్యాక్స్‌)పై ఫిర్యాదు చేశారు. అపార్టుమెంట్‌ నిర్మాణం అనుమతికోసం తన వద్ద బలవంతంగా రూ. 15 లక్షలు వసూలు చేశారని, ఆ డబ్బును వడ్డీతో సహా ఇప్పించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిల్డర్ తిరుపతిరావు కోరారు. ఈ టాక్స్ వ్యవహారంపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని దాంతో కెడెల శివరామ్ ను ఆయన పిఎ గుత్తా నాగప్రసాద్ లను కలిసి డబ్బు చెల్లించుకున్నానని ఆయన చెప్పారు.
ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన చెక్‌ను కోడెల శివరాం తీసుకెళ్లి డబ్బు డిమాండ్‌ చేశారని సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లికి చెందిన టీడీపీ నేత, శ్రీలక్ష్మీ తులసి ఏజెన్సీస్‌ నిర్వాహకుడు యెల్లినేడి శ్రీనివాస్‌ పోలీసుల వద్ద మొరపెట్టుకున్నారు. కోడెల కుటుంబం బాదితుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది

tags : kodela tax

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info