A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ శాఖల కేటాయింపులో వ్యూహాత్మకం
Share |
September 17 2019, 4:53 pm

ఆంద్రప్రదేశ్ లో కొత్త ముఖ్యమంత్రి జగన్ సరికొత్త సంచనాలకు కారణం అవుతున్నారు. ఆయా అంశాలలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సరికొత్త ట్రెండ్ గా మారుతున్నాయి. మంత్రివర్గం కూర్పు ఒక పెద్ద చర్చగా మారితే, ఆ తర్వాత మంత్రివర్గానికి శాఖల కేటాయింపు కూడా వ్యూహాత్మకంగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. తన తండ్రి మాదిరి ఒక మహిళా ఎమ్మెల్యేకి, అందులోను మొదటిసారి మంత్రి అయిన ఆమెకు హోం శాఖను కేటాయించారు.గతంలో వైఎస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో సబితా ఇంద్రారెడ్డి తొలి మహిళా హోం మంత్రి అయ్యారు.ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను కేటాయించిన జగన్ అందులో ఒక గిరిజన మహిళకు కూడా ఆ పదవి ఇవ్వడం గొప్ప సంగతి .ఆంద్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఇంతకాలం గిరిజనులకు ఉన్న ప్రాదాన్యత తక్కువే.అలాంటివారికి ఏకంగా గుర్తింపు నిచ్చిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.విజయనగరం జిల్లాకు చెందిన కురుపాం ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన పుష్పశ్రీవాణికి ఈ అవకాశం దక్కింది. ఆమె జీవితంలో ఇలాంటి అదృష్టం వరిస్తుందని ఊహించి ఉండకపోవచ్చు.అంతేకాదు.ఎమ్మెల్యే ఎన్నికలలో ఓడిపోయినా, బిసి వర్గానికి చెందిన సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఆయనకు రెవెన్యూ వంటి కీలకమైన శాఖను కూడా కట్టబెట్టడం గమనించదగిన అంశమే అవుతుంది.సాధారణంగా తన సొంత జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ఉండడం ఇష్టపడరు.అలాంటిది ఏకంగా ముస్లిం ఎమ్మెల్యేగా ఉన్న అంజాద్ పాషాను ఆ పదవికి జగన్ ఎంపిక చేసుకున్నారు. మొత్తం ఇరవై ఐదు మంది మంత్రులలో పందొమ్మిది మంది కొత్త మంత్రులు.ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి గా పదవి చేపట్టిన జగన్ కూడా గతంలో మంత్రి పదవి నిర్వహించలేదు. ఎమ్.పిగా, ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ఉండి పోరాటాల ద్వారా రాటు తేలి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ప్రజల ముఖ్యమంత్రి అనిపించుకోవాలన్న తాపత్రయంతో జగన్ ఇప్పుడు పనిచేస్తున్నారు.ప్రభుత్వానికి సంబందించిన దాదాపు అన్ని నిర్ణయాలలో ఆయనకు సానుకూల వాతావరణం ఏర్పడమే ఆయన సమర్దతకు నిదర్శనంగా కనిపిస్తుంది.అంతేకాదు నీటి పారుదల శాఖను కూడా బిసి వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ కు ఇవ్వడం కూడా తన తండ్రి మాదిరే చేశారని అనుకోవచ్చు. నిజానికి ఈ శాఖకు వేరే అగ్రవర్ణ నేతల పేర్లు మొదట ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇంతటి కీలకమైన శాఖను బిసి నేతకు అప్పటించారు. కాగా మున్సిపల్ శాఖను సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ఇవ్వడం ద్వారా వచ్చే మున్సిపల్ ఎన్నికలలో పార్టీని విజయపదంలో నడిపించే బాద్యతను ఆయనపై పెట్టారని అనుకోవచ్చు.అలాగే మరో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయతీ రాజ్ శాఖ అప్పగించడం ద్వారా పంచాయతీ ఎన్నికలు, మండల,జడ్పి ఎన్నికలు సజావుగా జరిగి ,పార్టీని విజయపదంలో నడిపించాలన్న ఉద్దేశం కావచ్చు. ఆర్దిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డికి ఇస్తారని అంతా ఊహించారు. అలాగే జరిగింది. దానికి కారణం గత ప్రభుత్వ టైమ్ లో బడ్జెట్ సమావేశాలలో బుగ్గన బాగా ప్రిపేర్ అయి ఆర్దిక పరిస్థితులు,ఆనాటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ఆర్దిక నిర్వహణ తీరుతెన్నులను సమగ్రంగా వివరించగలిగేవారు.ఆ క్రమంలోనే బుగ్గన కు పబ్లిక్ ఎక్కౌంట్స్ కమిటీ బాద్యతలను అప్పట్లో అప్పగిస్తే, ప్రభుత్వ స్కాములు అనేకం ఆయన బయటపెట్టగలిగారు. పట్టిసీమ స్కామ్ తో సహా పెక్కింటిని ఆయన బయటకు తెచ్చారు.కాగా మేకపాటి గౌతంరెడ్డికి పరిశ్రమలు, ఐటి శాఖను ఇవ్వడం ద్వారా ఆయనపై పెద్ద నమ్మకమే ఉంచారనుకోవాలి.గౌతంరెడ్డి కి సొంతంగా కూడా కంపెనీలు ఉన్నాయి. ఈ నేపద్యంలో ప్రతి జిల్లాకు ఏదో ఒక పరిశ్రమ తీసుకు రావడం, ఐటి పరిశ్రమ ఎపిలో పాతుకునేలా కృషి చేయడం లో సఫలం అయితే ఆయనకు,ముఖ్యమంత్రిగా జగన్ కు మంచి పేరు వస్తుంది.బలహీనవర్గాలకు సంబందించి కీలకమైన సంక్షేమం, పౌరసరఫరాలు వంటివాటిని విశ్వరూప్ ,కొడాలి నానికి అప్పగించడం ద్వారా వారికి ప్రాదాన్యత ఇచ్చారనుకోవచ్చు.అలాగే జగన్ తన ప్రభుత్వంలో విద్య,వైద్యానికి అత్యంత ప్రాదాన్యత ఇస్తామని చెప్పారు.ఆ రెండిటిని ఆదిమూలం సురేష్ కు, ఆళ్ల నానికి ఇచ్చారు. వారు చాలా కష్టపడి పనిచేయవలసి ఉంది. ఒక వైపు మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ ,మరో వైపు అదికారులను కూడా డైనమిక్ గా తీసుకు వెళ్లే యత్నం జగన్ చేశారు.అవినీతికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్న వైనం, తన ఎన్నికల మానిఫెస్టోలో కీలకమైన నవరత్నాల బోర్డులను సచివాలయంలో ఏర్పాటు చేయడం వంటి విన్నూత్ప పద్దతులకు జగన్ శ్రీకారం చుట్టారు. ఒక రకంగా ఈ పది రోజులలో జగన్ పట్ల ఏర్పడిన సానుకూల వైఖరినే మంత్రులు కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది.వారిలో ఎవరైనా వివాదాస్పదంగా మారితే చిక్కులు వస్తాయన్న సంగతి గమనించవలసి ఉంటుంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను చూసి టిడిపి నేతలు ఆశ్చర్యపోతున్నారట.జగన్ కు అనుభవం ఏముందని ప్రచారం చేసిన టిడిపి నేతలకు ఆయనను ప్రభుత్వపరంగా ఎలా విమర్శించాలన్నదానిపై తర్జనభర్జన పడే పరిస్తితి ఏర్పడింది.ఇదే సమయంలో ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి చేసిన జగన్ చేసిన కామెంట్ ఆ వర్గాలలో మరింత విశ్వాసం నింపిందని చెప్పాలి.గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కి చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నారని ఎవరిపై కక్షలు ఉండవని చెప్పడం కాకుండా,అసలు అలా అప్పటి ముఖ్యమంత్రికి వారు సన్నిహితంగా ఉండడం తప్పేమి కాదని చెప్పి వారందరిని సంబ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. దాంతో ఆయన ఈ మాటలు అన్న వెంటనే ఉద్యోగులంతా హర్షాతిరేకంగా చప్పట్లు చరిచారు. ఈ రకంగా శాఖల పరంగా మంత్రులకు తగు రీతిలో గౌరవించడం కాని, ఉన్నతాదికారులకు, ఉద్యోగులకు ఒక ఆత్మ విశ్వాసం కల్పించడంలో కాని జగన్ సఫలం అయ్యారని అంగీకరించక తప్పదు.

tags : jagan,portfolios

Latest News
*పవన్ కళ్యాణ్ కు అడవి ఎక్కడ ఉందో తెలుసా
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*ముఖ్యమంత్రి యుటర్న్ తీసుకున్నారా?
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info