A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టివి 9 యాజమాన్యంపై రవిప్రకాష్ తీవ్ర ఆరోపణ
Share |
June 25 2019, 3:16 pm

టివి 9 కొత్త యాజమాన్యంపై మాజీ సిఈఓ రవిప్రకాష్ సంచలన ఆరోపణ చేశారు. అప్పట్లో టీవీ 9 ఏర్పాటు సమయంలో మారిషస్‌ నుంచి ఫెమా నిబంధనలకు విరుద్ధంగా రూ. 60 కోట్ల నిధులు వచ్చాయని, ప్రస్తుతం టీవీ 9లో వాటాను విక్రయించిన సందర్భంలో కూడా హవాలా మార్గాల్లోనే నిధులు తరలించారని ఆయన ఆరోపించారు. అది కూడా కశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులను తెచ్చే దారులలో ఈ డబ్బు తీసుకు వచ్చారని ఆయన ఆరోపించారు. వీటిపై దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లకు తాను ఇటీవల ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం తనను వెంటాడుతోందని ఆరోపించారు. టీవీ9లో రవిప్రకాశ్‌కు 10 శాతం వాటా ఉందని, 2003 నుంచి సీఈవోగా ఉన్నారని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు. మిగతా 90 శాతం వాటాను ఇతరులు కొనుగోలు చేశారన్నారు. ఆ వాటాల కొనుగోలుకు రూ. 500 కోట్లకు రహస్య ఒప్పందం జరిగిందన్నారు. ఇందులో రూ. 294 కోట్లు నగదుగా ఇచ్చారని, ఇది హవాలా మార్గంలో తీసుకు వచ్చారని ఆయన అన్నారు.

tags : ravipraksh, new managemetn

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info