A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి నేతలకు నీరు-చెట్టు బకాయిలు గోవిందా
Share |
June 25 2019, 3:49 pm

ఎపిలో తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన నీరు-చెట్టు పధకం కింద బకాయిలు చెల్లించడానికి ముఖ్యమంత్రి జగన్ నో చెప్పారు.
2015–16 నుంచి మే 29, 2019 దాకా ఈ పథకానికి రూ.18,060.70 కోట్లను టీడీపీ సర్కార్‌ ఖర్చు చేసింది. చేసిన పనులకంటూ రూ.16,843.86 కోట్ల బిల్లులను చెల్లించింది. ఇంకా రూ.1,216.84 కోట్లు బకాయిపడింది.నీరు–చెట్టు పథకంలో అక్రమాల గుట్టు విప్పేందుకు సిద్ధమైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బకాయిపడ్డ బిల్లులను చెల్లించవద్దని ఈ నెల 6న జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. వాటిని అమలు చేస్తూ బకాయి బిల్లులు చెల్లించకూడదని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చెరువుల్లో పూడికతీత, చెరువు కట్టల మరమ్మతులు, తూముల మార్పిడి, చెరువులకు నీటిని సరఫరా చేసే సప్లయ్‌ ఛానల్స్‌ (వాగులు, వంకలు)లో పూడిక తీత, చెక్‌ డ్యామ్‌ల పునరుద్ధరణ, కొత్త చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం, కాంటూరు కందకాలు, పంట కుంటల తవ్వకం పనులను ‘నీరు–చెట్టు’ కింద చేపట్టారు. అయితే అనేక పనులలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.

tags : ap, tdp,jagan

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info