A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ క్యాబినెట్ తొలి సమావేశంలో
Share |
September 17 2019, 4:48 pm

ఆంద్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గ తొలి సమావేశం సోమవారం జరుగుతుంది.
సోమవారం ఉదయం 10.30 గంటలకు సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో గల మంత్రివర్గ సమావేశం మందిరంలో సీఎం అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఎనిమిది అంశాలతో కేబినెట్‌ అజెండాను రూపొందించారు. ఎన్నికల ప్రణాళికలో వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏడాదికి ఒక్కో రైతు కుంటుంబానికి పెట్టుబడి సాయంగా 12,500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌ నుంచి అమలు చేస్తామని పేర్కొన్నప్పటికీ ఈ రబీ నుంచే అందివ్వాలని, ఈ మేరకు తొలి కేబినెట్‌లో ఆమోద ముద్ర వేయడానికి ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకు వేశారు.

వచ్చే నెల నుంచి అవ్వా తాతలు, వితంతువులతో పాటు మత్స్యకారులు, చేనేత కార్మికులకు రూ.2,250, వికలాంగులకు రూ.3,000.. డయాలసిస్‌ రోగులకు రూ.3,500 నుంచి రూ.10 వేలకు పింఛన్‌ పెంపు
– పింఛన్‌ అర్హత వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు
– ఆర్టీసీని ప్రభుత్వంలో ఏ విధంగా విలీనం చేయాలనే దానిపై నిర్ణయం
– రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి, హోం గార్డులు, మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుపై నిర్ణయం
– రాష్ట్రంలోని 42 వేల మంది ఆశా వర్కర్ల వేతనాలను రూ.3,000 నుంచి రూ.10 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలపనున్నారు.

tags : jagan, cabinet

Latest News
*పవన్ కళ్యాణ్ కు అడవి ఎక్కడ ఉందో తెలుసా
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*ముఖ్యమంత్రి యుటర్న్ తీసుకున్నారా?
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info