A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వెల్ డన్ జగన్ ..కీప్ ఇట్ అప్
Share |
June 25 2019, 3:40 pm

అన్నం ఉడికిందా?లేదా అన్నది తెలుసుకోవడానికి మొత్తం అన్నం అంతా పట్టుకోనవసరం లేదు. ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. అలాగే ఒక ముఖ్యమంత్రి పనితీరు మొదటి వారంలోనే అర్దం అవుతుందని అనుకోవచ్చు. నలభైఐదేళ్ల వయసులో తన కష్టార్జితంతో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ పదవీబాద్యతలు చేపట్టినప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలను గమనించండి.వాటిలో ఒక నిబద్దత కనిపించడం లేదూ..ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూనే ఒక మాట చెప్పారు.తాను సంక్షేమ కార్యక్రమాల అమలులో కులం చూడను,పార్టీ చూడను. ప్రాంతం చూడను..అర్హులైన ఎవరైనా తనకు ఒకటే అని స్పష్టం చేశారు.అంతేకాక ఆయన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా ముందుగా వృద్దుల పెన్షన్ ను పెంచారు.నిజానికి ఇప్పుడు ఉన్న ఆర్ధిక పరిస్థితిలో ఇది చాలా కష్టమైన విషయం.అయినా జగన్ తొలి నిర్ణయం అవ్వ,తాతలకు కొంత మేలు చేసేదిగా ఉండాలని అనుకున్నారు. జగన్ పాదయాత్రలో బహుశా ఎక్కువ మంది అవ్వ,తాతలను కలుసుకున్నారు. వారి దుర్భర జీవితాలను గమనించారు.అందుకే ముందుగా ఆయన వారికి పెన్షన్ పెంచారు. ఆయన ఎప్పుడూ ఒక్కసారే మూడువేల రూపాయలుగా పెన్షన్ చేస్తానని చెప్పలేదు.అదికారంలోకి వచ్చిన తర్వాత క్రమేపి పెంచుకుంటూ పోతానని చెప్పారు.కాని తెలుగుదేశం నేతలు కొందరు దీనిపై దుష్ప్రచారం చేయడం ఆరంభించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు చేశారు.టిడిపి గత ఐదేళ్లుగా ఆడిన అబద్దం ఆడకుండా ఆడి గబ్బు పట్టింది. కనీసం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అయినా నిజాలు మాట్లాడడం అలవాటు చేసుకుంటే మంచిది.లేకుంటే వారికే నష్టం అని చెప్పాలి. ప్రజలు టిడిపి అబద్దాలను సహించలేకపోయారని గంటా వంటివారు గుర్తించాలి. నిజానికి మాబోటి వారం బహుశా ఏడాదికి 200 రూపాయలు చొప్పున పెంచుతారని అనుకున్నాం.కాని నాలుగేళ్లలోనే పెన్షన్ మూడువేల రూపాయలు తీసుకు వెళ్లాలని ఆయన సంకల్పించారు.అంతేకాదు. కిడ్నీ బాదితులకు పదివేల రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తానన్న హామీని వెంటనే నిలబెట్టుకున్నారు. అంటే సమాజంలో అట్టడుగున ఉండి, అనేక కష్టాలు పడుతున్నవారిని జగన్ గుర్తించారన్నమాట.ఇవే కాదు.మరికొన్ని నిర్ణయాలు కూడా ఆయన చేశారు. మద్య నిషేధం పై కూడా దశలవారీగా చేస్తామని చెప్పారు. అదే ప్రకారం ఆయన బెల్ట్ షాపుల నిరోధనాకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.బెల్ట్ షాపుల ఎత్తివేత అన్నది అంత తేలికైన విషయం కాదు.రాజకీయంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్న విషయం ఇది. అయినా జగన్ నిర్భయంగా ముందుకు వెళుతున్నారు. ఒక్కసారి 2014 లో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పేరుకు ఐదు మొదటి సంతకాలు పెట్టినా వాటిలో నాలుగు ఆచరణకు రావడమే కష్టం అయింది. అంతేకాదు.కలెక్టర్ ల సమావేశం పెట్టి టిడిపి నేతలకు, కార్యకర్తలకు సహకరించాలని నేరుగా చెప్పి కలకలం సృష్టించారు. కాని జగన్ మాత్రం పార్టీలకు అతీతంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలని స్పష్టం చేశారు.ఈ ఒక్క పాయింట్ లో తేడాను గమనించవచ్చు. నలభై ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకునే చంద్రబాబు తీరు వివాదాస్పదం అయితే, జగన్ తీసుకున్న నిర్ణయాలకు సర్వత్రా హర్షం వ్యక్తం అయింది.విద్యార్దులకు పెట్టే మధ్యాహ్న బోజనం సమకూర్చే ఏజెన్సీలకు పారితోషికం పెంచడం కాని, శనివారం నాడు పిల్లలకు పుస్తకాల బ్యాగ్ ల భారం లేకుండా చేయడం కాని ..ఇవన్ని హర్షణీయం.అంతేకాదు.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో సత్సంబందాలు నెలకొల్పుకోవడం ద్వారా రెండు రాస్ట్రాల తెలుగు ప్రజలకు ఎంతో సంతోషం కలిగించారని చెప్పాలి. చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాల మద్య ఉద్రిక్తతలు ఏర్పడే విదంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే జగన్ అందుకు భిన్నంగా వ్యవహరించడం ద్వారా ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా జగన్ కు పండు తినిపించిన దృశ్యం అందరికి ఆనంద దాయకం అయిందని చెప్పాలి. అలాగే కేంద్రంలో ప్రధాని మోడీని కలవడం, ఆయన నుంచి సహకారం పొందడానికి హామీ తెచ్చుకోగలగడం వంటివి కూడా జగన్ కు ఉపకరించే అంశం అవుతుంది. చంద్రబాబుకు జగన్ కు ఒక ముఖ్యమైన తేడా ఏమిటంటే, జగన్ ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబుకు ఆయాచితంగా కాకపోయినా, తన మామ ఎన్.టి.ఆర్.ను దించేసి ముఖ్యమంత్రి సీటు ఆక్రమించుకున్నారు.ఆ తర్వాత మరోసారి వాజ్ పేయి, ఇంకోసారి మోడీ,పవన్ కళ్యాణ్ ల సాయంతో అదికారంలోకి వచ్చారు.కాని ఆ విషయం ఆయన మర్చి పోయి తను సొంతంగా అదికారంలోకి వచ్చానని భ్రమించారు.తనంత సీనియర్ దేశంలోనే లేరని అనుకునేవారు.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై నిత్యం కాలుదువ్వేవారు. జగన్ మాత్రం వాటికి విరుద్దంగా ఎంతో మర్యాదగా ,హుందాగా ఉండడం స్పష్టంగా కనిపిస్తుంది.తాను ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలా అన్న లక్ష్యంతో ఆయన కనిపిస్తున్నారు.జగన్ ముఖ్యమంత్రి గా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నప్పటి నుంచి ఇంతవరకు ఈ వారంలో జగన్ వ్యవహార శైలి అందరి ప్రశంసలు పొందగలిగిందని చెప్పవచ్చు. ప్రత్యర్ధి పార్టీలుగా ఉండే సిపిఎం పక్ష నేతలు కూడా జగన్ ను మెచ్చుకున్నారంటేనే ఇక వేరే సర్టిఫికెట్ ఇవ్వవలసిన అవసరం ఏముంటుంది. సో..వెల్ డన్ జగన్..కీప్ ఇట్ అప్.(గ్రేట్ ఆంద్రా లో ప్రచురితం)

tags : jagan, well done

Latest News
*చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించారు-జగన్
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info