A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రవి ప్రకాష్ ను నయీంతో పోల్చారు
Share |
July 20 2019, 12:43 pm

టివి 9 మాజీ సిఈఓ రవిప్రకాష్ ను మాఫియా గ్యాంగ్ లీడర్ నయీంతో పోల్చుతూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.ఈ మీడియా నయీం ను ఏ బాబు రక్షిస్తాడోనని ఆయన అన్నారు.

‘పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్‌ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్‌. ఇక ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి. నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్దం పరారైపోయింది!. విచారణకు రండి అని పోలీసులు చాలా మర్యాదగా రవిప్రకాష్‌ ఇంటికి నోటీసులు అంటిస్తుంటే ‘నకిలీ ప్రవక్త’ రాత్రికి రాత్రి దొడ్డి దారిలో గోడ దూకేసి బోర్డర్‌ దాటేశాడు. రేపో మాపో మాల్యాతో సెల్ఫీ దిగుతూ కనిపించి పట్టుకోండి చూద్దాం అంటాడేమో!’ అని ఆయన ట్విటర్ లో వ్యాఖ్యానించారు.

tags : vijayasaireddy

Latest News
*జక్కంపూడికి కాపు కార్పోరేషన్ చైర్మన్ పదవి
* టోల్ ప్లాజాల వద్ద పాస్టాగ్ లేకుంటే డబుల్ రేట్
*బిసిలకు కొత్తగా 16 కార్పొరేషన్లు
*కాంట్రాక్టులు సగం ఎస్సి,ఎస్టి,బిసిలకే -ఎపి
*రిటైర్డ్ జడ్జి పై జగన్ వ్యాఖ్య- చంద్రబాబు అబ్జక్షన్
*పోలవరంపై చర్చ టిడిపికి ఇష్టం లేదు
*రాజధానిలో కొత్త వర్శీటీలలో నో ఫ్రీ
*ఎపిలో పెట్టుబడులకు కొత్త సంస్థ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info