A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టాలివుడ్ ప్రముఖులకు మళ్లీ టెన్షన్
Share |
July 20 2019, 2:01 am

డ్రగ్స్ కేసులో సీనీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు వచ్చిన వార్తలను ఎక్సైజ్ అదికారులు తోసిపుచ్చుతున్నారట.దానికి సంబందించి దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వారు చెబుతున్నారు.ఈ కేసులో 62 మందిని విచారించినా ఎవరిపైనా చర్య తీసుకోలేదని విమర్శలు వచ్చిన నేపద్యంలో అదికారులు దీనిపై వివరణ ఇస్తున్నారు. అలాంటి ప్రచారంలో నిజం లేదని వారు చెబుతున్నారు. డ్రగ్స్‌ కేసులో ఇప్పటివరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేశామని, ఐదుకు పైగా అభియోగ పత్రాలు దాఖలు చేయాల్సి ఉందని చెప్పారు. ఇంకా పలు ఆధారాలు రావాల్సి ఉందని స్పష్టంచేశారు. తమకు లభ్యమైన ఆధారాలను బట్టి ఎప్పటికప్పుడు అభియోగ పత్రాలు దాఖలుచేసి కోర్టుకు సమర్పిస్తున్నాం తప్ప ఎవరికీ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని పేర్కొన్నారు.ఇది టాలివుడ్ ప్రముఖులకు టెన్షన్ కల్గించడానికి చెబుతున్నారా?లేక నిజంగానే కొందరు సినీ ప్రముఖులపై కూడా కేసులు పెడతారా?

tags : film nagar, drugs case

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info