A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కు సోనియాగాందీ లేఖ
Share |
June 2 2020, 12:01 am

ఎఐసిసి నేత, యుపిఎ చైర్ పర్సన్ సోనియాగాందీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ కు కూడా లేఖ రాశారట. ఈ నెల ఇరవైమూడున జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి రావాలని ఆమె కోరారట. ఈ మేరకు ఒక ఆంగ్ల పత్రిక కదనాన్ని ఇచ్చింది.ఒకప్పుడు జగన్ ఓదార్పు యాత్రను వ్యతిరేకించడమే కాకుండా, ఆయనను జైలులో పెట్టించేవరకు వెళ్లిన సోనియాగాందీ ఇప్పుడు జగన్ కు కూడా లేఖ రాయడం విశేషమే. బిజెపిని, మోడీని అదికారంలోకి రాకుండా నిలువరించడం కోసం యుపిఎ పక్షాలతో ఇరవైమూడు న ఒక సమావేశం ఏర్పాటు చేయాలని సోనియా సంకల్పించారు.ఈ సమావేశానికి ఎన్.డి.ఎ.లో భాగస్వాములుగా లేని టిఆర్ఎస్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ లను కూడా ఆహ్వానించారట. అలాగే ఇప్పటికే కాంగ్రెస్ తో చెలిమి చేస్తున్న టిడిపికి కూడా లేఖ వెళ్లింది.అయితే కెసిఆర్,జగన్ లు ఈ సమావేశానికి వెళతారా?లేదా అన్నది మే 23 నాటి ఫలితాలను బట్టి ఉంటాయని ఆ పత్రిక విశ్లేషించింది.

tags : jagan, sonia,letter

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info