A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్, చంద్రబాబు- ఎవరి ట్రాప్ లో ఎవరు పడ్డారో
Share |
June 2 2020, 4:04 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఎఐసిసి అదినేత రాహుల్ గాందీల భేటీ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వీరిద్దరిలో ఎవరు ఎవరి ట్రాప్ లో పడ్డారన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఎక్కువ మంది అయితే చంద్రబాబు ట్రాప్ లోనే రాహుల్ పడ్డారని అంటున్నారు. చంద్రబాబు తెలివిగా తాను మిగిలిన విపక్షాలను కూడగడతానని, యుపిఎ -3 అదికారంలోకి రావడానికి అవసరమైన వ్యూహాలను తయారు చేస్తానని చెబుతూ రాహుల్ కు దగ్గరయ్యాడని అంటున్నారు. కొందరైతే రాహుల్ కు చంద్రబాబు నాయుడు సలహాదారుగా మారారా అని కూడా వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. విశేషం ఏమిటంటే ఈ విషయంలో చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా రాహుల్ గాందీ తీరుతో కాంగ్రెస్ నేతలు తలపట్టుకుంటున్నారు. చంద్రబాబు ను పట్టుకుని రాహుల్ కాంగ్రెస్ ను మరింత ముంచుతున్నాడని కొందరు భయపడుతున్నారు. తెలంగాణలో చంద్రబాబుతో కలిసిన తర్వాత ఎదురైన చేదు అనుభవం తర్వాత కూడా చంద్రబాబుకు ప్రాదాన్యం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని అంటున్నారు.రాహుల్ ను చంద్రబాబు కలవడానికి కొద్ది రోజుల ముందే కాంగ్రెస్ ఎమ్.పి కెవిపి రామచంద్రరావు ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆంద్రాకు ,పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని, చంద్రబాబు వల్ల ఎపికి 30 వేల కోట్ల నష్టం వచ్చిందని ఆయన ఆరోపించారు. అయితే రాహుల్ ఇవేవి పట్టించుకోవడం లేదు. తెలంగాణలో ఓటమి తర్వాత ఎపిలో కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకోలేదు.కనీసం మంచో,చెడో ఎపిలో కూడా కాంగ్రెస్ తో పొత్తు ఉంటే అదో పద్దతిగా ఉండేది.అలాకాకుండా చంద్రబాబు ఆడమన్నట్లు అల్లా రాహుల్ ఆడి పార్టీ పరువు తీశారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.గతంలో ఈ సందర్భంగా సోనియాగాందీని, రాహుల్ ను చంద్రబాబు బండబూతులు మాదిరి దూషించిన విషయాలను గుర్తు చేస్తున్నారు.రాహుల్ ప్రత్యేక హోదా కోసం గుంటూరు వచ్చినప్పుడు టిడిపి వాళ్లతో ఎలా నిరసనలు చెప్పించారో తెలుసు. ఆ సందర్భంలోనే రాహుల్ చేతకానివాడని, కాంగ్రెస్ ఒక చెత్త పార్టీ అని కూడా అన్నారు. సోనియాగాందీని అయితే దెయ్యం, ఆంద్రుల పొట్టకొట్టింది ..నాలుగున్నర లక్షల కోట్లు విదేశాలకు తరలించింది..ఇటలీ మాఫియా ఇలా అనేక పరుష పదాలతో చంద్రబాబు తిట్టి పోస్తే ,ఆయనతో రాహుల్ స్నేహం చేయడం ఏమిటని కొందరు వాపోతున్నారు.కనీసం ఎపి,తెలంగాణ కాంగ్రెస్ నేతలతో అయినా చంద్రబాబు తో ఉండవలసిన సంబందాలపై చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించి పార్టీని రాహులే దెబ్బతీస్తున్నారన్నది పలువురి వాదనగా ఉంది.తాజాగా ఎపిలో చంద్రబాబు గెలిచేపరిస్థితి లేదని, తర్వాత ఏవైనా ఇబ్బందులు వస్తే కాంగ్రెస్ ను,యుపిఎ ఇతర పక్షాలను తనకు మద్దతుగా వాడుకోవడం కోసం చంద్రబాబు వ్యూహం పన్నితే అందులో రాహుల్ చిక్కాడా అన్నది కొందరి భావన.రాహుల్ ను కలిసిన తర్వాత బెంగాల్ వెళ్లి అక్కడ మమతకు మద్దతు ఇచ్చారని,అంటే కాంగ్రెస్ ను,వామపక్షాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని,దీనిని ఎలా అర్దం చేసుకోవాలన్న ప్రశ్న కూడా వస్తుంది. డిల్లీలో చంద్రబాబు వెంట తిరిగిన కాంగ్రెస్,వామపక్ష నేతలకు ఈ విషయం లో సిగ్గుపోయినా పెద్దగా పీల్ అవడంలేదన్న అబిప్రాయం కలుగుతోంది.ఈవి ఎమ్ లపై చంద్రబాబు ఏది మాట్లాడితే దానికి వంత పాడుతూ ఆయన వెనుక తిరగడం ద్వారా కూడా కాంగ్రెస్ ,వామపక్షాలకు పరువు పోయినట్లయింది.ఒకవేళ యుపిఎ కి కేంద్రంలో అదికారంలోకి వచ్చే పరిస్తితి ఉంటే అప్పుడు చక్రం తిప్పవచ్చన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారని చెబుతారు. అయితే ఇదే సమయంలో ఆయనే నేనుగా ఇంతవరకు యుపిఎలో బాగస్వామి అని కాని, రాహుల్ ప్రదాని కావడానికి మద్దతు ఇస్తానని కూడా చెప్పకుండా తిరుగుతున్నారు. ఈ విషయాలను గమనించకుండా చంద్రబాబుతో స్నేహం చేస్తే,గతంలో మాదిరి ఏ మాత్రం అవకాశం ఉన్నా,ఆయన బిజెపి కూటమి వైపు మళ్లీ జంప్ చేయరని గ్యారంటీ ఉందా అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఏది ఏమైనా చంద్రబాబు ఏ లక్ష్యంతో కాంగ్రెస్ ను ,రాహుల్ గాందీని తన ట్రాప్ లోకి వచ్చేలా చేసుకున్నా దానివల్ల ఎక్కువ నష్టం జరిగింది కాంగ్రెస్ కే అన్నది స్పష్టం. అయితే కాంగ్రెస్ పార్టీ ని అంత తక్కువ అంచనా వేయనవసరం లేదని, ఎవరినైనా వాడుకోగలదని, చంద్రబాబు కూడా అందులో భాగమేనని కొందరు అబిప్రాయపడుతున్నా,ఇప్పటికైతే ఆ పరిస్థితి కనబడడం లేదు .రాహుల్ గాంధీనే చంద్రబాబు ట్రాప్ లో పడ్డారేమోనన్నది ఎక్కువ మంది అబిప్రాయంగా ఉంది.
.

tags : rahul

Latest News
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info