A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్టిసిలో చంద్రబాబు దుబారా 225 కోట్లా
Share |
June 2 2020, 12:46 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబారా ఇప్పుడు మరింతగా బయటకు వస్తున్నట్లుగా ఉంది. చంద్రబాబు తన పాలనలో నిర్వహించిన వేలాది సభలకు జనాన్ని తరలించడానికి ఆర్టిసి బస్ లను వాడేవారు. వాటి తాలూకూ ఆర్టిసికి 225 కోట్ల రూపాయలు రావల్సి ఉందట. బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ విషయమై ఆర్టిసి ఎమ్.డి.కి ఒక లేఖ రాశారు.ఆర్టీసీ అప్పులు, ఆస్తులు, నష్టాలు, లీజుల కేటాయింపుపై చర్చించేందుకు వెంటనే అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని వీర్రాజు డిమాండ్‌ చేశారు. సీఎం సభల కోసం ఏర్పాటు చేసిన బస్సులకు సంబంధించి దాదాపు రూ.225 కోట్ల బకాయిల రూపంలో ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలతోపాటు టీడీపీ సమావేశాలకు డ్వాక్రా మహిళలను తరలించడానికి, పోలవరం ప్రాజెక్టు సందర్శనకు డబ్బులు చెల్లించకపోయినా ఆర్టీసీ యాజమాన్యం బస్సులు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆయన అన్నారు.

tags : chandrababu, rtc, waste

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info