A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబుకు మహిళల రిటర్న్ గిప్ట్ -న్యూస్ స్టింగ్ స్టోరీ
Share |
August 26 2019, 3:46 pm

తూర్పు,గోదావరి జిల్లాలలో మహిళల్లో తెలుగుదేశంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, వారు చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇవ్వబోతున్నారంటూ న్యూస్ స్టింగ్ ఇచ్చిన ఈ కదనం ఆసక్తికరంగా ఉంది...మీరూ చదవండి.

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ‘రిటర్న్ గిఫ్ట్’ కి మించిన బర్నింగ్ టాపిక్ లేదనే చెప్పాలి. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ మాట తొలుత ఉపయోగించారు. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టారని, చంద్రబాబుకి తాను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ అన్నమాటలు రెండు రాష్ట్రాల నేతల్లోనూ, ప్రజల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఆ తరవాత తెలంగాణ నేతలు. వైసీపీ నేతలు కూడా చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ రెడీ అయిందని ప్రకటించారు. దీనికి చంద్రబాబు గట్టి కౌంటరే ఇచ్చారు. కానీ ఏపీ ఎన్నికలు ముగిసిన వేళ టీడీపీ నేతల్లో ‘రిటర్న్ గిఫ్ట్’ గుబులు రేపుతోంది.
నాలుగేళ్ళు నిశ్శబ్దంగా ఊరుకుని డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పేరుతో చెక్కులు ఇచ్చారు చంద్రబాబు. తాను పెద్ద కొడుకుగా, అన్నగా చేదోడువాదోడుగా ఉంటానని చెప్పుకొచ్చారు. టీడీపీ ఎన్నికల ప్రకటనలు కూడా అదే విధంగా సాగాయి. ఈ ఎన్నికల్లో పసుపు కుంకుమ తమకు ప్లస్ పాయింట్ అవుతుందని అక్కాచెల్లెళ్ళు తనకు ఓట్లను బహుమానంగా ఇస్తారని చంద్రబాబు పదేపదే చెప్పారు.
అంతే ఉత్సాహంగా ఎన్నికల్లో తిరిగారు. వృద్ధాప్య పింఛన్లు, పసుపుకుంకుమ, అన్నదాద సుఖీభవ, బడుగు, బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలు టీడీపీని మళ్ళీ అధికారంలోకి తెస్తుందని భావించారు. దీనికి తగ్గట్టుగా ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. మహిళల ఓట్లు తమకు సానుకూల ఫలితాలు వస్తాయని టీడీపీ నేతలు కొండంత నమ్మకంతో ఉన్నారు.
అయితే అందుతున్న సమాచారం, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం ఎన్నికల ముందు పసుపు కుంకుమ చెక్కులు ఇచ్చిన చంద్రబాబు.. నాలుగేళ్ళ నుంచి తమను పట్టించుకోలేదని, అందుకే తాము చంద్రబాబుకి ఊహించని నజరానా ఇస్తారంటున్నారు. అది రిటర్న్ గిఫ్ట్ రూపంలో ఉంటుందని వారు చెబుతున్నారు. తమకు 2 లక్షల వరకూ అప్పు ఉందని, ఎన్నికలకు ముందు అదంతా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పుడు సగం కూడా మాఫీ కాలేదంటున్నారు తెలుగింటి ఆడపడుచులు. అందుకే తాము చంద్రబాబుకి సర్ ప్రైజ్ ఇస్తామంటున్నారు.
ఈ ఎన్నికల్లో తెలుగు దేశానికి గెలుపు అన్నది ఒక చారిత్రకమైన అవసరం. ఈసారి చంద్రబాబు ఓడిపోతే తెలుగుదేశానికి భవిష్యత్తు ఉండదు. మరో ఐదేళ్ళు పార్టీని కాపాడుకోవడం కష్టం. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు చంద్రబాబు-జగన్మోహన్ రెడ్డికి జీవన్మరణ సమస్యలాంటివి. సర్వేలు, అంచనాలు జగన్‌కి అనుకూలంగా ఉన్నాయి. అందుకే చంద్రబాబు రివ్యూ సమావేశాలు పేలవంగా ఉంటున్నాయి. పోటీచేసిన అభ్యర్థులు, సీనియర్‌ నేతల్లో మాత్రం ఎక్కడా గెలుపుపై భరోసా కనిపించడంలేదు.
బలమైన నేతలుగా చెప్పుకునే వారు సైతం తమ నియోజకవర్గాల్లో గెలుస్తామో? లేదో? అనే రీతిలో మాట్లాడడం ఇతర నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కచ్చితంగా గెలుస్తారని టీడీపీ భావిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌.. తనకు చాలా గట్టి పోటీ ఉందని, మైనస్‌లో ఉన్నానని పలువురు మీడియా ప్రతినిధుల ఎదుటే చెప్పడం టీడీపీలో నెలకొన్న తాజా పరిస్థితికి అద్దం పట్టింది.

పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి టీడీపీ నేతలలో ఇప్పుడు ఓటమి వణుకు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘనమైన ఫలితాలను అందించిన పశ్చిమగోదావరి వాసులు ఈసారి టీడీపీకి షాకివ్వబోతున్నారని రిటైర్డ్ ప్రిన్సిపల్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రాయూనివర్శిటీ మాజీ పాలకమండలి సభ్యులు డా.గుబ్బల తమ్మయ్య అభిప్రాయపడ్డారు.
రాబోయే ఎన్నికల ఫలితాలపై ఆయన ‘న్యూస్ స్టింగ్’ ప్రతినిధితో మాట్లాడారు. ఈసారి ఈవీఎంలలో ఉన్న తీర్పు తెలుగుదేశం పార్టీకి షాకిస్తుందన్నారు. జనం మార్పుకోరుకుంటున్నారని, ఎన్నికల్లో వైసీపీ బాగా పుంజుకుంటుందన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల ఓటర్లు వినూత్నమయిన తీర్పును ఇవ్వబోతున్నారని తమ్మయ్య చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో తాను పర్యటించానని, టీడీపీ నేతలు భావిస్తున్నట్టు పసుపు కుంకుమ రూపంలో చంద్రబాబు ఇచ్చిన చెక్కుల కంటే తాము మోసపోయామనే భావన మహిళల్లో ఎక్కువగా ఉందన్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో చంద్రబాబు అంచనాలు తలక్రిందులు అవుతాయన్న అభిప్రాయం వ్యక్తంచేశారు తమ్మయ్య.
మరో వైపు తాము కచ్చితంగా గెలుస్తామని చెప్పే సాహసం చేయడం లేదు అభ్యర్ధులు. పలువురు మంత్రులు సైతం గెలుపుపై స్పష్టత లేకుండా మాట్లాడినట్లు తెలిసింది. ఈసారి వైఎస్సార్‌సీపీ నుంచి ఊహించని స్థాయిలో పోటీ వచ్చిందని గోదావరి జిల్లాలకు చెందిన ఒకరిద్దరు మంత్రులు అంతర్మథనం చెందుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఈసారి ఓటమి అంచున ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆచంటలో మూడోసారి పోటీలో ఉన్న టీడీపీ నేత పితాని సత్యనారాయణకు వైసీపీ అభ్యర్ధి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గట్టిపోటీ ఇచ్చారు. పితాని గెలుపు అంత ఆషామాషీ కాదని, ఓటర్లు షాకిచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు రాజకీయ విశ్లేషకులు డా. గుబ్బల తమ్మయ్య.
పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరులో పోటీ చేయకుండా పక్క జిల్లాకు వెళ్ళిన మరో మంత్రి జవహర్‌కు కూడా కృష్ణా నదిలో ఎదురీత తప్పదంటున్నారు. సమీకరణలన్నీ తమకు వ్యతిరేకంగా ఉన్నాయని, తమ వెంట ఉంటారనుకునే బీసీల్లోనూ ఈసారి మార్పు వచ్చిందని, ఓటింగ్‌ సరళి కూడా అంచనాకు అందడంలేదని కాకలు తీరిన నేతలే తలలు పట్టుకుంటున్నారు. మొత్తం మీద టీడీపీ నేతలకు ఈ ఎన్నికలు షాకివ్వబోతున్నాయని అంటున్నారు. అయితే చంద్రబాబుకి సన్నిహితులైన నేతలు మాత్రం గెలుపుపై ధీమాతో వున్నారు.
మహిళల ఓట్లు తమకే పడతాయని, ఈసారి టీడీపీ అనూహ్య విజయం సాధిస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ వై.వీ.బాబు రాజేంద్రప్రసాద్ ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నారు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రన్న చేసిన సాయం మహిళలకు కొండంత భరోసా కల్పించిందని రాజేంద్రప్రసాద్ ‘న్యూస్ స్టింగ్’ ప్రతినిధితో చెప్పారు. మహిళా ఓట్లతో తాము 115-120 సీట్లు సాధించబోతున్నామని, మహిళలది నిశ్శబ్ధ విప్లవం అన్నారాయన. మే23న వెల్లడయ్యే ఫలితాలు తమకు అనుకూలం అంటున్నారు. ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు మళ్ళీ సీఎం కుర్చీపై కూర్చోవడం ఖాయం అంటున్నారు. మరి ఎవరి ధీమా ఉంటుందో తెలియాలంటే మరో నెలరోజులు ఆగాల్సిందే.

tags : news sting

Latest News
*4 రాజధానులా..క్లారిటీ ఇవ్వండి -టిడిపి
*పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info