A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇంటర్ బోర్డు చెలగాటం-కెసిఆర్ కు అప్రతిష్ట
Share |
August 26 2019, 3:48 pm

తెలంగాణలో ఇంటర్ ఫలితాల వ్యవహారం టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిందని చెప్పాలి. వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్తుతో ఇంటర్ బోర్డు చెలగాటమాడింది.దీనిపై విద్యార్దులలో ,వారి తల్లిదండ్రులలో ఆందోళన పెల్లుబుకింది.దీనిపై పెద్ద ఎత్తున ఇంటర్ బోర్డు వద్ద నిరసనలు జరిగాయి. విద్యార్ది సంఘాలు కూడా ఆందోళనలకు దిగాయి. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, సంపత్ వంటివారు మద్దతు పలికారు. కాగా ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు విక్రమార్క లేఖ రాశారు. బోర్డు అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిందని లేఖలో తెలిపారు. 10లక్షల మంది విద్యార్థుల ఫలితాల విషయంలో ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ఇంత కీలకమైన అంశంలో సీఎం కేసీఆర్‌ స్పందన శూన్యమని విమర్శించారు.వెంటనే రీకౌంటింగ్ చేయించి విద్యార్దులకు న్యాయం చేయాలని వారు కోరారు. విద్యాశాఖ మంత్రి బోర్డు అధికారులతో కనీసం సమీక్ష కూడా చేయలేదని ఆరోపించారు. వెంటనే బోర్డు అధికారులను సస్పెండ్‌ చేసి సమగ్ర విచారణకు ఆదేశించాలని లేఖలో డిమాండ్‌ చేశారు.

tags : telangana, inter board

Latest News
*4 రాజధానులా..క్లారిటీ ఇవ్వండి -టిడిపి
*పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info