A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఎందుకు ఇంత లొల్లి చేస్తున్నారు!-విశ్లేషణ
Share |
August 26 2019, 2:58 pm

ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తి అయిన తర్వాత జరుగుతున్న లొల్లిని గమనించారా? స్వయంగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ లొల్లిని ముందుకు తీసుకు వెళ్లడానికి విశ్వయత్నం చేస్తున్నారు. అది గమనించేవారంతా విస్తుపోవలసి వస్తోంది.నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు ఇలా ప్రవర్తిస్తారా?అన్న ప్రశ్నకు సమాదానం దొరకడం లేదు. ప్రధానంగా నా ఓటు నాకు పడిందా?ఎవరికి పడిందో ..అంటూ ఆయన చేసిన వ్యాఖ్య అందరిని విభ్రాంతికి గురి చేసింది..చంద్రబాబుకు ఏమైంది అన్న ప్రశ్నను తెలుగుదేశంవారు సైతం వేసుకుంటున్నారు.చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి తాము గెలుస్తామని చెప్పారు.ఆ సందర్భంలో ఎక్కడా తాను వేసిన ఓటు టిడిపికి పడిందో ,లేదో అన్న అనుమానాన్ని వ్యక్తం చేయలేదు.అంటే దానర్ధం చంద్రబాబు వివిపాట్ లో తను వేసిన పార్టీ గుర్తు చూసుకునే బయటకు వచ్చారనే కదా..అప్పుడు ఆయనకు సందేహం రాలేదనే కదా..మరి ఆ కాసేపటికి ఏమైందో..కాని చంద్రబాబు వెంటనే ఒక పెద్ద వ్యూహాన్నే అమలు చేయడం ఆరంభించారు.ప్రతి ఎన్నికలోను కొన్ని చోట్ల ఈవిఎమ్ లు మొరాయిస్తుంటాయి. వాటిని సాంకేతిక సిబ్బంది వెళ్లి సరిచేస్తుంటారు. కాని చంద్రబాబు మాత్రం దానిని ప్రపంచ సమస్యగా మార్చాలని చూశారు. ఏకంగా ముప్పై శాతం ఈవి ఎమ్ లు పనిచేయడం లేదని, సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే పాన్ కు పడుతోందని కొందరు చెబుతున్నారని అంటూ కొత్త పుకార్లను లేవదీసే యత్నం చేశారు. ఆయన ఏకంగా ఈ విషయాలపై ఎన్నికల ముఖ్య అదికారికి లేఖ కూడా పంపించారు. ఇందులో విషయం అర్దం అవుతూనే ఉంది. పెద్ద ఎత్తున తరలి వస్తున్న ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతోందని ఇంటెలెజెన్స్ ఉప్పు అందించి ఉండాలి.అందుకే ఓటర్లను తప్పు దారి పట్టించే లక్ష్యంతో ఆయన ఏకంగా ముప్పై శాతం ఈవిఎమ్ లు పనిచేయడం లేదని, ఓటర్లు అంతా వెళ్లిపోతున్నారని టిడిపి ద్వారా ప్రచారం పెట్టారు. ఆ తర్వాత మళ్లీ ఆయనే తెలివిగా ఓటు వేయడానికి రావాలని పిలుపు ఇచ్చినట్లు లీక్ ఇచ్చుకున్నారు.ఇవన్ని ఎన్నికల వ్యూహంలో భాగమేనని అర్దం చేసుకునేవారికి తెలియకపోదు.కాకపోతే చంద్రబాబు ఇంకా పాత పద్దతిలో దిక్కుమాలిన రాజకీయాలు చేయాలని యోచిస్తున్నారు. అందువల్లే ప్రజలు ఎవరూ ఈయన లేఖను పట్టించుకోలేదు.ఈయన పిలుపు కోసం ఎదురు చూడలేదు. ఎనభై శాతం మంది ఓట్లు వేశారు.ఆ తర్వాత పోలింగ్ బూత్ ల వద్ద సదుపాయాలు లేవని, మరొకటని,మరొకటని ప్రచారం చేశారు.వాటన్నిటికి ఎవరు బాద్యత వహించాలి? రాష్ట్ర ప్రబుత్వమే కదా..ఒక స్కూల్ బాగోపోతే ఎన్నికల కమిషన్ ఏమి చేస్తుంది?స్కూల్ లో మంచినీళ్లు లేవంటే సిగ్గుపడవలసింది రాష్ట్ర ప్రభుత్వమా?లేక ఎన్నికల కమిషనా?ఎన్నికల కమిషన్ కు ఏమైనా ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారా? రాస్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సిబ్బందినే కదా వారు వాడుకునేది.వాళ్లను ముందుగా నియమించింది, జాబితాను పంపించింది రాష్ట్రమే కదా..అందుకే కదా..అంగన్ వాడీ వర్కర్లు,ఆశా వర్కర్లు ఇలా నైపుణ్యం లేని వారిని, నారాయణ, చైతన్య విద్యాసంస్థలవారిని పెట్టుకున్నది..వీళ్లలో చాలా మందికి ఈవిఎమ్ లకు, వివిపాట్ లకు కనెక్షన్ ఇవ్వడం రాక ఇబ్బంది పడి పోలింగ్ ఆలస్యం అయితే అదేదో ఎన్నికల సంఘం విఫలం అయినట్లు ప్రచారం చేయడం ఏమిటి? ఎక్కడ ఎన్నికల సంఘంతో చంద్రబాబుకు ఇబ్బంది వచ్చింది అంటే..తనకు అనుకూలంగా జిల్లాలలో పూర్తిస్తాయిలో పనిచేస్తున్న ఇద్దరు ,ముగ్గురు ఎస్పిలను బదిలీ చేయడాన్ని,తన కుమారుడు లోకేష్ పోటీచేసిన మంగళగిరిలో ఇద్దరు సిఐ లను కమిషన్ బదిలీ చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఎబి వెంకటేశ్వరరావు బదిలీ సరేసరి..2009లో ఇదే చంద్రబాబు కదా..మొత్తం ముఖ్యమంత్రి తో సహా అటెండర్ వరకు అంతా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తారని చెప్పింది. అప్పటి డిజిపి యాదవ్ ను బదిలీ చేయాలని కోరడం,కమిషన్ ఆ విదంగా మార్చడం జరిగింది కదా..అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖరరెడ్డి లొల్లి చేయలేదు కదా..ఇప్పుడు ఎందుకు చంద్రబాబు ఇంత గొడవ చేస్తున్నారు..దానికి కారణం స్పష్టంగానే కనిపిస్తోంది. రాయలసీమ మొదలు ప్రకాశం జిల్లా వరకు గతసారే వెఎస్ ఆర్ కాంగ్రెస్ మెజార్టీ సీట్లు వచ్చాయి. మిగిలిన జిల్లాలలో ఆ పార్టీ ఈసారి ఇంకా పుంజుకుంది.దానికి తోడు టిడిపి కి ఆయువుపట్టుగా గతసారి పనిచేసిన తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలలో జనసేనప్రభావం కాని,ప్రజలు మార్పు కోరుకోవడం వల్ల కాని టిడిపి దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.ఎనిమిది జిల్లాలలో టిడిపి కి మైనస్ అయిన తర్వాత మిగిలిన ఐదు జిల్లాలలో మొత్తం సీట్లు గెలుచుకునే పరిస్తితి ఎటూ లేదు.దాంతో ఓటమి అంచున ఉన్నామన్న భయంతోనే చంద్రబాబు మొత్తం నెపం అంతా ఈవి ఎమ్ లపై నెడుతున్నట్లుగా ఉంది.అదే విషయాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ప్రశ్నించారు. తెలుగుదేశం సభ్యులు కాని, పోలింగ్ ఏజెంట్లు కాని చంద్రబాబు చెబుతున్నట్లు ఈవిఎమ లు పనిచేయకపోతే ప్రశ్నించకుండా ఉంటారా?వారెవ్వరికి రాని సందేహం చంద్రబాబు ఒక్కరికే ఎందుకు వచ్చింది..ప్రజలను అయోమయానికి గురి చేయడం కోసమే చంద్రబాబు ఈ వ్యూహాలు అమలు చేశారు. గతంలో 2014 లో ఇవే ఈవిఎమ్ లతో చంద్రబాబు గెలిచారు కదా..నంద్యాల ఉప ఎన్నికలో ఈవిఎమ్ లపై ఎలాంటి ఆరోపణ చేయలేదు కదా..ఇప్పుడే ఎందుకు చంద్రబాబు ఇలా లొల్లి చేస్తున్నారన్న సామాన్యుడి ప్రశ్నకు జవాబు చెప్పకుండా చంద్రబాబు,ప్రజాస్వామ్యం అని గొంతు చించుకుంటూ తిరిగేస్తున్నారు.ఎక్కడైనా ఎన్నికల కమిషన్ వైపు కొన్నిలోపాలు ఉంటే ఉండవచ్చు.వాటిని సరిచేయాలని చెప్పడం తప్పు కాదు.కాని ముప్పై శాతం ఈవిఎమ్ లు పనిచేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పారంటే ఏమి అనుకోవాలి. అంటే సుమారు ఇరవైవేల ఈవిఎమ్ లు పనిచేయడం లేదని ఆయనే వదంతి సృష్టించారు.తీరా చూస్తే అన్ని కలిపి నాలుగు వందల లోపే..గతసారి ఇలా పనిచేయనివి దు వందలపైనే ఉన్నాయట.తనకు మీడియా అండ ఉందని చంద్రబాబు చెలరేగిపోయారంటే ఆశ్చర్యం కాదు. అదే సమయంలో మళ్లీ తామే గెలుస్తామని చెబుతున్నారు.పైగా 150సీట్లు వస్తాయని అంటారు.ఈవిఎమ్ లలో మోసాలు జరిగితే అది ఆయనకు వ్యతిరేకంగా ప్రదాని మోడీ చేస్తే ఈయన ఎలా గెలుస్తారన్నదానికి సమాధానం దొరకదు. అన్ని అంశాలలోను రెండు నాల్కల దోరణి మాదిరే ఇక్కడ కూడా చంద్రబాబు డబుల్ టాక్ సాగించారు. టిడిపి కార్యకర్తలు డీమొరలైజ్ అవ్వకుండా గెలుస్తామని చెప్పడం, ఓడిపోతే ఎన్నికల సంఘంపైన ఆరోపణలు చేయడం ..ఈ రెండిటిలో ఏది కావాలంటే దానిని వాడుకోవడానికి వీలుగా ఆయన మాట్లాడుతున్నారు.దానివల్ల చంద్రబాబు విశ్వసనీయత మరింతగా దెబ్బతింటోంది.డెబ్బై ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు హుందాగా ఉండి,మంచి పేరు తెచ్చుకుంటే అంతా సంతోషిస్తారు. ఐదేళ్ల ఏకపక్ష పాలన సాగించిన విదంగానే ఎన్నికల తర్వాత కూడా ఆయన కొనసాగిస్తున్నారు.దీనివల్ల తెలుగుదేశం పార్టీకి మరింత నష్టం కలుగుతుంది. ఎన్నికల సంఘం నియమించిన చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యంను ఉద్దేశించి కోవర్టు అని, కేసులు ఉన్నాయని ఆరోపించడం సిఎమ్ కు తగునా?మరి అలాంటి వ్యక్తికి తన ప్రభుత్వంలోనే ప్రమోషన్ ఇచ్చారు కదా..తను ఎంపిక చేసుకున్న చీప్ సెక్రటరీ పునేఠాపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల సంఘంపై కేసు వేయించడం ద్వారా ఆయన పరువు తీశారు. చివరికి ఎన్నికల సంఘం ఆయనను విధుల నుంచి తప్పించింది.మరో వైపు టిడిపి నేతలు ఇష్టారాజ్యంగా డబ్బు పంపిణీ చేయకుండా ఐటి శాఖ, ఎన్నికల పర్యవేక్షకులు నిఘా పెట్టడం కూడా చంద్రబాబుకు చికాకు తెప్పించింది.అందుకే ఆ విషయాలను ఆయన దాచుకోలేకపోతున్నారు.బిజెపికి దూరం అయిన తర్వాత కొంతకాలం భయపడిన ఆయన ఎన్నికల సమయంలో హద్దులు దాటి ప్రదాని మోడీని,బిజెపిని తీవ్రంగా దూషించారు.ఎన్నికలలో ఓడిపోతే ఏమవుతుందోనన్న భయం కూడా ఆయనను వెంటాడుతోంది.టిడిపి ఓడిపోవచ్చు..గెలవవచ్చు..కాని విలువలు లేకుండా వ్యవహరించడం ఎప్పటికే అప్రతిష్టే. వెరసి ఇవన్ని కలిసి చంద్రబాబు ఈవిఎమ్ లని,మరొకటని లొల్లి,లొల్లి చేసి కాస్తో,కూస్తో మిగిలిన పరువును కూడా పోగొట్టుకున్నట్లయిందని చెప్పాలి.ఇది దురదృష్టం.

tags : chadnrababu, ec

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info