A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ప్లాన్ అప్పుడే పెయిల్ అయింది
Share |
August 26 2019, 2:41 pm

\ఐటీ గ్రిడ్స్‌ డేటా చోరీ కేసు తీగ లాగితే డొంకంతా కదులుతోందని, ఏపీ తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారమే కాకుండా పంజాబ్‌ పౌరుల సమాచారం కూడా దొంగలించారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ గూఢచార సంస్థ కంటే ప్రమాదకరంగా రహస్య సమాచార దోపిడీ జరిగిందని అన్నారు. మే 23 తర్వాత డేటా దొంగలంతా కటకటాల వెనక్కే అని ఆయన అన్నారు.ఓవైపు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోట్లలో బిల్లుల చెల్లింపులు చేస్తున్న అధికారులు సీఎస్‌ పునేఠాలాగే ఇబ్బంది పడతారని విజయసాయి రెడ్డి అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం స్పందించి చంద్రబాబును కట్టడి చేయాలని, ఆపద్ధర్మ సిఎం చేసిన బదిలీలను రద్దు చేయాలని ఆయన కోరారు. నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, ప్రైవేట్‌ యూనివర్సిటీల సిబ్బందిని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఈసీ అడ్డుకున్నప్పుడే చంద్రబాబుకు తన ప్లాన్‌ ఫెయిలైందని అర్థమైందన్నారు.ఆ తర్వాత తాను నియమించుకున్న ఆర్వోల మీద భారం వేశారని, అయితే ప్రజా తీర్పు మరోలా ఉండటంతో ఇప్పుడు ఈవీఎంలను బదనాం చేస్తున్నారని ఆయన అన్నారు.’

tags : vijaysaireddy

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info