A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి
Share |
August 26 2019, 2:34 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మాటలు తమాషాగా ఉన్నాయి. తెలుగుదేశం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ల మాదిరి జనసేన సీట్ల లేక్క వేయదని ఆయన అన్నారట.జనసేన చెప్పే మార్పు మొదలైందని, ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రజలతో మమేకమవ్వాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల్లో ఓటింగ్‌ సరళి గురించి మాత్రమే నాయకుల్ని అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు.
మార్పు ఎప్పుడూ చిన్నగానే మొదలవుతుందని, జనసేన ఎదిగే దిశలో ఈ మార్పు ఎంతవరకు వెళ్తుందో తెలియదన్నారు. గ్రామ స్థాయి నుంచి కొత్తతరం నేతలను తయారు చేయాలని ఈ సందర్భంగా పవన్‌ సూచించారు. గ్రామస్థాయిలో సమస్యల పట్టిక సిద్ధం చేయాలన్నారు. భయం, అభద్రతా భావాన్ని దాటుకొని వచ్చిన యువశక్తి తమతో ఉందన్నారు. ప్రతి చోటా రెండు కుటుంబాలే పెత్తనం చేస్తున్నాయని, ఈ అంశంపైనే పోరాటం చేద్దామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

tags : pawanklayn

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info