A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మూడు ,నాలుగు రోజుల్లో టిఆర్ఎస్ లో విలీనం
Share |
May 24 2019, 7:24 pm

మూడు ,నాలుగు రోజులలో టిఆర్ఎస్ లో కాంగ్రెస్ శాసనసభ పక్ష విలీన ప్రక్రియ పూర్తి అయిపోతుందని కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ముగ్గురు ఎమ్మెల్యేలు చెప్పారు.టీఆర్‌ఎస్‌ ఎల్పీలో సీఎల్పీ విలీనం ఖాయమని ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్‌ తెలిపారు. కాంగ్రెస్‌లో ‘ఆ ముగ్గురు’ మాత్రమే మిగులుతారని, మిగిలిన వారంతా టీఆర్‌ఎస్‌లోకే వస్తారని అన్నారు. విలీనానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ శాసనసభ పక్షం టిఆర్ఎస్ లో విలీనం అయితే మిగిలిన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర టీఆర్ఎస్‌లో చేరారు. తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, పొడెం వీరయ్య, జగ్గారెడ్డి కారెక్కనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

tags : trs, congress

Latest News
*చేయాల్సిందంతా చేసి లగడపాటి ఇప్పుడు..
*శనివారం వైసిపి ఎమ్మెల్యేల సమావేశం
*జగన్ ఇంటి వద్ద ఐఎఎస్,ఐపిఎస్ ల కోలాహలం
*అద్వానీపై,జోషిలపై మోడీ ప్రశంసల వర్షం
*తండ్రి,కూతుళ్లను ఓడించిన వైసిపి నేత
*మంత్రి వల్లే ఓడిపోయామన్న ముఖ్యమంత్రి
*కర్నాటకలో తెలుగింటి అమ్మాయి గెలుపుsu
*వినుకొండ కౌంటింగ్ లో గందరగోళం
*ఏడాదిలోగానే మంచి సి.ఎమ్. అనిపించుకుంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info